Record Break: 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆప్ఘనిస్థాన్ ఓపెనర్లు

ABN , First Publish Date - 2023-07-08T18:23:05+05:30 IST

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ (Bangladesh vs Afghanistan) ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (Rahmanullah Gurbaz and Ibrahim Zadran) రెండు రికార్డులను బద్దలకొట్టారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు ఫస్ట్ వికెట్‌కు ఏకంగా 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జంటగా రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ రికార్డు నెలకొల్పారు.

Record Break: 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆప్ఘనిస్థాన్ ఓపెనర్లు

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ (Bangladesh vs Afghanistan) ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (Rahmanullah Gurbaz and Ibrahim Zadran) రెండు రికార్డులను బద్దలకొట్టారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు ఫస్ట్ వికెట్‌కు ఏకంగా 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జంటగా రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ రికార్డు నెలకొల్పారు. దీంతో 11 ఏళ్ల రికార్డును వీరు బ్రేక్ చేశారు. కాగా గతంలో 31 మార్చి 2012న నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్థాన్ ఓపెనర్లు జావేద్ అహ్మదీ, కరీమ్ సాదిక్ 141 పరుగులు చేశారు. ఇంతకుముందు వరకు ఆప్ఘనిస్థాన్ తరఫున ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఉండేది. తాజాగా ఈ రికార్డు బ్రేకైంది.


అంతేకాకుండా గుర్బాజ్, జద్రాన్ నెలకొల్పిన 256 పరుగుల భాగస్వామ్యం.. ఒక్క ఓపెనింగ్‌లోనే కాకుండా ఆప్ఘనిస్థాన్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. 2010లో స్కాట్లాంపై రెండో వికెట్‌కు ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లు మహ్మద్ షాజాద్, కరీం సాదిక్ 218 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటివరకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ఉండేది. కానీ తాజాగా గుర్బాజ్, జద్రాన్ దీనిని అధిగమించి 13 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్(145), ఇబ్రహీం జద్రాన్ (100) సెంచరీలతో చెలరేగడంతో ఆప్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Updated Date - 2023-07-08T18:23:05+05:30 IST