Home » Bangladesh
ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్లో 112 కేసులు నమోదయ్యాయి.
మహపుజ అలం ఇటీవల ఫేస్బుక్ ఫోస్ట్లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును 'విజయ్ దివస్'గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న 'ఇండిపెండెన్స్ డే' జరుపుతుంది.
ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందూ కమ్యూనిటీని కూకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే బంగ్లాలో హింస జరుగుతోందని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో మాత్రమే కాదు, పాకిస్థాన్లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందువులపై దాడులను మనం ఎంతమాత్రం సహించరాదని సూచించారు.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దాంతో పరిణామాలు తీవ్రంగా మారాయి.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాలు, మత సంస్థలకు భద్రత కరవయిందని, వాటిపై దాడులు జరగడం విచారకరమని తెలిపింది.
బంగ్లాదేశ్లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజాగ్రాహం వెల్లువెత్తింది. దీంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్ లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది.
పాకిస్థాన్ మారణహోమాలను అడ్డుకుని.. తన ఆవిర్భావానికి సహకరించిన భారత్ భద్రతకే బంగ్లాదేశ్ ఇప్పుడు ముప్పు తలపెడుతోంది.