Asia Cup: ఆసియా కప్ ప్రారంభ తేదీ ప్రకటన... మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-06-15T17:10:01+05:30 IST
ఆసియా కప్ 2023 (Asia cup2023) ప్రారంభ, ముగింపు తేదీలను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) గురువారం ప్రకటించింది. ఆగస్టు 31న మొదలై 17న ముగియనుంది. వరల్డ్ కప్‌నకు ముందు జరగబోయే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.
దుబాయ్: ఆసియా కప్ 2023 (Asia cup2023) ప్రారంభ, ముగింపు తేదీలను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) గురువారం ప్రకటించింది. ఆగస్టు 31న మొదలై 17న ముగియనుంది. వరల్డ్ కప్‌నకు ముందు జరగబోయే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.
కాగా.. ఈ టోర్నమెంట్ హైబ్రీడ్ మోడల్‌లో జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగనుండగా మిగతా 9 మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నారు. 2023 ఎడిషన్‌లో రెండు గ్రూపులుగా జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4 నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి. కాగా ఆసియా కప్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు స్వాగతం చెప్పేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రకటనలో ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.