Pakistan vs India: ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ.. టీమిండియా టాపార్డర్‌ను కూల్చేసిన షహీన్ అఫ్రీది
ABN , First Publish Date - 2023-09-02T16:43:17+05:30 IST
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ, ఒక ఫోర్ కొట్టి కోహ్లీ బౌల్డ్ అయి వెనుదిరిగారు. టీమిండియా టాపార్డర్‌ను కూల్చేసిన గత చరిత్ర కూడా షహీన్ అఫ్రీదికి ఉంది.
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ, ఒక ఫోర్ కొట్టి కోహ్లీ బౌల్డ్ అయి వెనుదిరిగారు. టీమిండియా టాపార్డర్‌ను కూల్చేసిన గత చరిత్ర కూడా షహీన్ అఫ్రీదికి ఉంది. వర్షం కూడా టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌కు తలనొప్పిగా తయారైంది. మ్యాచ్ మొదలై నాలుగో ఓవర్ ఆడుతుండగా వర్షం ఇబ్బంది పెట్టింది. అయితే కాసేపటికే వర్షం ఆగిపోయి మళ్లీ మ్యాచ్ మొదలైంది. కానీ.. వర్షం పడటం పాక్ బౌలర్లకు కలిసొచ్చింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. వర్షం తర్వాత షహీన్ అఫ్రీది మెరుగ్గా బౌలింగ్ చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. ఈ ఇద్దరూ ఔట్ కావడం టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, గిల్ కొంత నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ 10వ ఓవర్‌లో రౌఫ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి శ్రేయాస్ అయ్యర్ క్యాచ్‌గా దొరికిపోయాడు. దీంతో.. టీమిండియా 10 ఓవర్లకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ ఔట్ కావడంతో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు దిగాడు. టీమిండియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.
గతేడాది అక్టోబరు.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సాగిన తీరును అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరేమో.. 160 పరుగుల ఛేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. విరాట్ వీర విహారాన్ని ప్రపంచమంతా వేనోళ్ల పొగిడింది. అతడి ఒంటరి పోరాటం ఫలితంగానే ఆఖరి బంతికి భారత్ గట్టెక్కింది.