BCCI: వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌పై బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు
ABN , First Publish Date - 2023-09-23T20:59:00+05:30 IST
మన భారతీయ క్రీడాభిమానులు క్రికెట్‌ను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం టీమిండియా మ్యాచ్‌లే కాదు.. ఇతర దేశాల మధ్య మ్యాచ్ జరిగినా ఎంతో ఆసక్తిగా చూస్తారు. మైదానంలో...
మన భారతీయ క్రీడాభిమానులు క్రికెట్‌ను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం టీమిండియా మ్యాచ్‌లే కాదు.. ఇతర దేశాల మధ్య మ్యాచ్ జరిగినా ఎంతో ఆసక్తిగా చూస్తారు. మైదానంలో మ్యాచ్ ఉందని తెలిస్తే చాలు.. ఎగబడి మరీ చూస్తారు. ఇప్పుడు వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. అన్ని మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చాలా మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే.. ఒక మ్యాచ్ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ తప్పదు. అదే.. పాకిస్తాన్ vs న్యూజీల్యాండ్ మ్యాచ్.
ఈ నెల 29వ తేదీన పాక్, కివీస్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశమైన పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి.. ఇది తప్పకుండా చూడాల్సిందేనన్న ఉద్దేశంతో అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ.. ఇప్పుడు ఈ మ్యాచ్‌కి అభిమానులకు అనుమతి లేదు. ఓ కారణం వల్ల.. బీసీసీఐ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గణేశ్ నిమజ్జనం సమయం కావడంతో.. పోలీసులందరూ ఆ పనుల్లో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాము ఈ మ్యాచ్‌కి తగిన సెక్యూరిటీ ఇవ్వలేదని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో.. అభిమానులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే వార్మప్ మ్యాచ్‌కి అభిమానులు రావొద్దని, అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంకు ఎవరూ రావొద్దని సూచించారు. మరి.. అమ్ముడుపోయిన టికెట్ల సంగతి ఏంటి? అని అనుకుంటున్నారా! ఆ డబ్బులన్నీ తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు. టికెట్లు కొన్న వాళ్లందరికీ తిరిగి డబ్బులు ఇస్తామని బీసీసీఐ తెలిపింది. పాపం.. ఈ మ్యాచ్‌ని స్టేడియంకి వెళ్లి వీక్షించాలని అనుకున్న అభిమానులకు ఇది చేదువార్తే!