IPL2023 Jio: ఐపీఎల్ 2023 ప్రారంభానికి 3 రోజుల ముందు జియో గుడ్‌న్యూస్!.. జియో యూజర్లకే ఈ అవకాశం
ABN , First Publish Date - 2023-03-27T19:17:50+05:30 IST
భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ (Cricket fans) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2023) 16వ సీజన్ మరో 3 రోజుల్లోనే ఆరంభమవబోతోంది. ఈ నేపథ్యంలో...
ముంబై: భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ (Cricket fans) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2023) 16వ సీజన్ మరో 3 రోజుల్లోనే ఆరంభమవబోతోంది. మార్చి 31న చెన్నై వర్సెస్ గుజరాత్ (Chennai super kings vs gujarat titans) మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయాకామ్ 18 మీడియా కంపెనీ (Viacom 18 Media company) దక్కించుకోవడంతో ఆండ్రాయిడ్ యూజర్లు జియోసినిమా (JioCinema) యాప్‌లో మ్యాచ్‌లను వీక్షించాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్‌లు మరింత క్లారిటీగా ప్రసారం కానున్న నేపథ్యంలో వినియోగదారుల డేటా బ్యాలెన్స్ త్వరగా అయిపోయి అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభానికి సరిగ్గా 3 రోజుల ముందు టెలికం దిగ్గజం జియో (Reliance Jio) గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇళ్లకు ఎల్లప్పుడు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, నిరంతరాయ స్ట్రీమింగ్ కోసం సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ‘బ్యాకప్’ ప్లాన్‌ను (backup plan) ప్రవేశపెట్టింది.
జియోఫైబర్ ‘బ్యాకప్’ ప్లాన్‌ను (JioFiber Backup) జియో ప్రవేశపెట్టింది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో రూ.198తో రీఛార్జ్ చేసుకుంటే నెలంతా 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చు. అంతేకాకుండా వన్-క్లిక్ స్పీడ్ అప్‌గ్రేడ్, ఉచితంగా ల్యాండ్‌లైన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక 5 నెలల కనెక్షన్ కావాలనుకునేవారు రూ.1490తో రీచార్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఈ ప్లాన్‌లో ఉంది. ఇళ్లలో 24 గంటలపాటు నిరంతరాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి ఈ ప్లాన్ దోహదపడుతుందని రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్ పేర్కొంది. కాగా ఈ కొత్త ప్లాన్ మార్చి 30 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుందని కంపెనీ వెల్లడించింది. ఇళ్లకు ప్రత్యమ్నాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి, తక్కువ రేటులో డేటా సప్లై ఈ కొత్త బ్యాకప్ ప్లాన్ ద్వారా సాధ్యమవుతుందని జియో ప్రెస్ రిలీజ్ పేర్కొంది.