Chandrayaan 3: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన చంద్రయాన్ 3.. ఎలాగో తెలుసా?..
ABN , First Publish Date - 2023-08-26T19:38:58+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును చంద్రయాన్ 3(Chandrayan 3) బద్దలుకొట్టింది. చంద్రయాన్ 3కి విరాట్ కోహ్లికి రికార్డు సంబంధమేంటనే అనుమానం మీకు రావొచ్చు. కానీ.. ఇది నిజమే.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును చంద్రయాన్ 3(Chandrayan 3) బద్దలుకొట్టింది. చంద్రయాన్ 3కి విరాట్ కోహ్లికి రికార్డు సంబంధమేంటనే అనుమానం మీకు రావొచ్చు. కానీ.. ఇది నిజమే. ఎలా అంటే.. సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)(Twitter) ఈ రికార్డుకు వేదికైంది. 10 నెలల క్రితం ఎక్స్(X)లో విరాట్ కోహ్లీ ఓ ట్వీట్(Tweet) పెట్టాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2022) పాకిస్థాన్‌పై టీమిండియా(india vs pakistan) సాధించిన విజయానికి సంబంధించినది ఆ ట్వీట్. ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను కోహ్లీ ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ విజయం ప్రత్యేకమని, మద్దతిచ్చిన అభిమాలందరికీ ధన్యావాదాలు కూడా చెబుతూ రాసుకొచ్చాడు. కాగా ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ టీమిండియా విజయంలో(Team india) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ పోస్టుకు ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 796.2K(7 లక్షల 96 వేలు)లైక్‌లు(Likes) వచ్చాయి. దీంతో మన దేశంలో ఎక్స్‌లో అత్యధిక లైక్స్ వచ్చిన ట్వీట్‌గా ఇది రికార్డు సృష్టించింది.
అయితే ఈ రికార్డును తాజాగా చంద్రయాన్ 3 బద్దలుకొట్టింది. కాగా చంద్రయాన్ 3 ఈ నెల 23న విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇస్రో(ISRO) ‘‘నేను నా గమ్యాన్ని చేరుకున్నాను’’ అని చంద్రయాన్ 3 విజయవంతమైందని ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఇస్రో చేసిన ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు 24 గంటల్లోనే ఏకంగా 839.5K(8 లక్షల 39 వేలు) లైక్‌లు వచ్చాయి. దీంతో ఎక్స్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన ట్వీట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ట్వీట్‌కు వచ్చిన లైక్‌ల రికార్డును చంద్రయాన్ 3 24 గంటల్లోనే బద్దలు కొట్టడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.