Share News

Rohit Sharma: ఫైనల్‌లోనూ రోహిత్ శర్మ అదే దూకుడు.. ఇంకాసేపు క్రీజులో ఉండుంటే?

ABN , First Publish Date - 2023-11-19T17:13:06+05:30 IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత అగ్రెసివ్‌గా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పుకోవనసరం లేదు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. అవతల బౌలర్లు ఎవరన్న సంగతి పట్టించుకోకుండా, దూకుడుగా ఆడుతాడు. ఎడాపెడా షాట్లతో చెలరేగిపోతాడు.

Rohit Sharma: ఫైనల్‌లోనూ రోహిత్ శర్మ అదే దూకుడు.. ఇంకాసేపు క్రీజులో ఉండుంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత అగ్రెసివ్‌గా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పుకోవనసరం లేదు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. అవతల బౌలర్లు ఎవరన్న సంగతి పట్టించుకోకుండా, దూకుడుగా ఆడుతాడు. ఎడాపెడా షాట్లతో చెలరేగిపోతాడు. ఈ వరల్డ్ కప్ 2013 టోర్నీలోనూ అదే ఆటతీరు కనబరిచాడు. లీగ్ దశలోలో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్.. ఆ తర్వాతి మ్యాచ్ నుంచి ఆకాశమే హద్దుల చెలరేగి ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే తీరుని ఫాలో అయ్యాడు.

రోహిత్ ఇలా అగ్రెసివ్‌గా ఆడుతుండటం వల్ల.. భారత్‌కి శుభారంభమే అందుతోంది. సెమీస్ దాకా రోహిత్ ఆ దూకుడు ప్రదర్శించడం కారణంగా.. ఆ తర్వాత వస్తున్న బ్యాటర్లు అద్భుతంగా రాణించగలిగారు. కానీ.. రోహిత్ అగ్రెసివ్‌గా ఆడుతూనే, ఆచితూచి రాణిస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఫైనల్‌లో రోహిత్ కాస్త ఆచితూచి ఆడితే బెటరని అంతా అనుకున్నారు. కానీ.. ఫైనల్ మ్యాచ్‌లోనూ రోహిత్ అదే ఆటతీరుతో విజృంభించాడు. తన రూట్ సపరేట్ అన్నట్టుగా.. కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. ఆరంభం నుంచి కాన్ఫిడెంట్‌గానే కనిపించిన అతడు.. చాన్స్ దొరికినప్పుడల్లా ఆస్ట్రేలియా బౌలర్లపై ఎటాక్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు తన గేమ్ ప్లాన్‌ను అమలు చేసిన రోహిత్.. 31 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు.


రోహిత్ దూకుడు చూసి.. ఈ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపుతాడని అంతా భావించారు కానీ, అతడు హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. 47 పరుగుల వద్ద అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే.. రోహిత్ ఇంకాసేపు క్రీజులో ఉండుంటే బాగుండేదని, అతడు బిగ్ స్కోర్ సాధించి ఉండే ఆ లెక్క వేరేగా ఉండేదని చెప్పుకుంటున్నారు. అతడు కనీసం సెంచరీ చేసి ఉన్నా.. భారత జట్టు స్కోరు పరుగులు పెట్టేదని, ఇతర ప్లేయర్లలోనూ మరింత జోష్ నింపి ఉండేదని భావిస్తున్నారు. ఇది ఎంతో కీలకమైన మ్యాచ్ కాబట్టి.. అగ్రెసివ్‌గా కన్నా ఆచితూచి ఆడి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. అప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం ఒక మోత మోగిపోయేదని, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టేవని అభిప్రాయపడుతున్నారు.

కాగా.. బిగ్ స్కోర్ సంగతి పక్కనపెడితే రోహిత్ ఒక రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. అతడు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని రోహిద్ బద్దలుకొట్టేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తన 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. కివీస్ కెప్టెన్‌ని రోహిత్ దాటేశాడు. ఈ వరల్డ్ కప్ ఎడిషన్‌లో రోహిత్ మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లో 597 పరుగులు సాధించి.. వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక స్కోరు చేసిన కెప్టెన్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

Updated Date - 2023-11-19T17:13:08+05:30 IST