World Cup 2023: ఫైనల్ మ్యాచ్‌లో ముగింపు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్.. దుమ్మురేపనున్న దువా లిపా
ABN , First Publish Date - 2023-11-16T20:12:41+05:30 IST
వన్డే వరల్డ్‌కప్ 2023 తుది దశకు చేరుకుంది. మన భారత క్రికెట్ జట్టు ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఘరంగా ముగింపు వేడుకలను...
Dua Lipa: వన్డే వరల్డ్‌కప్ 2023 తుది దశకు చేరుకుంది. మన భారత క్రికెట్ జట్టు ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఘరంగా ముగింపు వేడుకలను నిర్వహించనున్నారన్నదే ఆ అప్డేట్ సారాంశం. మరో విశేషం ఏమిటంటే.. ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ సింగర్ దువా లిపా ప్రత్యేక ప్రదర్శన ఉండనుంది. ప్రపంచకప్‌ను అధికారికంగా ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ వాళ్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ముగింపు వేడుకలో దువా లిపా ప్రదర్శించనుందని, ఆమె గాత్రంతో ఈ వరల్డ్‌కప్ అద్భుతంగ ముగియనుందని స్టార్ స్పోర్ట్స్ చెప్పుకొచ్చింది.
మరో వార్త ఏమిటంటే.. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రానున్నారు. ఆయనతో పాటు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన మరికొందరు ప్రముఖులు సైతం హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 2011 వరల్డ్ కప్ తర్వాత.. అంటే 12 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్స్‌కి చేరడం, అది కూడా హోమ్ గ్రౌండ్ కావడంతో.. అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. ఇక ఈ మైదానం సీటింగ్ పరంగా దేశంలోనే అతిపెద్దది. ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 30 వేల పైనే. దీన్ని బట్టి.. ఫైనల్ మ్యాచ్‌లో రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో, మీరే ఊహించేసుకోండి. ఒకవైపు దువా లిపా, మరోవైపు ప్రధాని మోదీతో పాటు ఎందరో అతిథులు, లక్షా 30 వేల మంది ఆడియెన్స్.. ఇలా చెప్పుకుంటుంటేనే గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయి.
ఇక టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. ఈ మెగాటోర్నీలో ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా, ఈ పదింటిలోనూ అద్భుత విజయాల్ని నమోదు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్నింటిలోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ముదులిపేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌గా రోహిత్ జట్టుకి శుభారంభాన్ని అందిస్తే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చితక్కొట్టేశారు. కోహ్లీ అయితే 50 శతకాల రికార్డ్‌ని కూడా ఈ టోర్నీలో బద్దలు కొట్టేశాడు. ఇక బౌలింగ్‌లో మహమ్మద్ షమీ జట్టుకే వెన్నెముకలా అవతరించాడు. ఈ టోర్నీలో మూడుసార్లు ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెమీ ఫైనల్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వరల్డ్ కప్ మనదే.