IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. లక్నో బ్యాటింగ్

ABN , First Publish Date - 2023-04-01T19:18:01+05:30 IST

ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రెండు బలమైన జట్లు

IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. లక్నో బ్యాటింగ్

లక్నో: ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రెండు బలమైన జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్(LSG)-ఢిల్లీ కేపటిల్స్(DC) తలపబడబోతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్(David Warner) మరోమాటకు తావులేకుండా ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టాస్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన ఢిల్లీ స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player) విషయంలో తనకు కొంత గందరగోళంగా ఉన్నట్టు చెప్పాడు. కాగా, గత సీజన్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ ఈసారి ఏకంగా కప్పుపైనే కన్నేసింది. మరోవైపు, సొంత మైదానం కావడంతో చెలరేగిపోవాలని లక్నో పట్టుదలగా ఉంది. తాము ఇప్పటి వరకైతే ఇక్కడ ఆడలేదని ఆ జట్టు కెప్టెన్ రాహుల్ అన్నాడు. ఇప్పటికైతే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.

Updated Date - 2023-04-01T19:18:01+05:30 IST