IPL 2023: ఇరక్కొడుతున్న డుప్లెసిస్, కోహ్లీ.. పరుగులు పెడుతున్న స్కోరు

ABN , First Publish Date - 2023-04-20T16:42:43+05:30 IST

పంజాబ్ కింగ్స్(PBKS) బౌలర్లను ఆర్సీబీ(RCB) ఓపెనర్లు డుప్లెసిస్(Duplessis), విరాట్ కోహ్లీ(Virat Kohli)

IPL 2023: ఇరక్కొడుతున్న డుప్లెసిస్, కోహ్లీ.. పరుగులు పెడుతున్న స్కోరు

మొహాలీ: పంజాబ్ కింగ్స్(PBKS) బౌలర్లను ఆర్సీబీ(RCB) ఓపెనర్లు డుప్లెసిస్(Duplessis), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉతికి ఆరేస్తున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఇద్దరూ కలిసి బౌలర్లను ఆడుకుంటున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలిస్తూ ఎడాపెడా పరుగులు పిండుకుంటున్నారు. ఇద్దరూ కలిసి 12 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దూకుడుగా ఆడిన ఇంపాక్ట్ ప్లేయర్ డుప్లెసిస్ 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడి దూకుడు కొనసాగుతోంది.

మరోవైపు, ఈ సీజన్‌లో జోరుమీదున్న కోహ్లీ 40 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిశాయి. ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 131 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో వికెట్ నష్టపోకుండా 130 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. డుప్లెసిస్ 67, కోహ్లీ 57 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-04-20T16:42:43+05:30 IST