IPL 2023: ఐపీఎల్ లైవ్‌ను ఉచితంగా ఇలా చూసేయండి!
ABN , First Publish Date - 2023-03-30T17:53:19+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) వచ్చేసింది. మొత్తం 10 జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) వచ్చేసింది. మొత్తం 10 జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు గతేడాది వస్తూనే ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను చిత్తుచేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కూడా గతేడాదే ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్ సూపర్ పవర్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లు చెత్త ప్రదర్శనతో వరుసగా 9, 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఐపీఎల్ టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్(Star Sports) సొంతం చేసుకోగా, డిజిటల్ మాధ్యమ హక్కులను వయాకామ్ 18(Viacom 18) కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్‌ను జియో సినిమా(Jio Cinema)లో పూర్తి ఉచితంగా కూడా వీక్షించొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా జియో కనెక్షనే. అదొక్కటి ఉండి, సరిపడా డేటా ఉంటే ఐపీఎల్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.