IPL 2023: హైదరాబాద్‌ను కూల్చేసిన జడేజా.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2023-04-21T21:20:56+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun

IPL 2023: హైదరాబాద్‌ను కూల్చేసిన జడేజా.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి చెన్నైకి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సెంచరీ హీరో హారీ బ్రూక్ 18 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. రాహుల్ త్రిపాఠి 21, కెప్టెన్ అయిడెన్ మార్కరమ్ 12, హెన్రిక్ క్లాసెన్ 17, మార్కో జాన్సెన్ 17 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకోగా, ఆకాశ్ సింగ్, మహీశ్ తీక్షణ, మతీసా పథిరన తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2023-04-21T21:20:56+05:30 IST