IPL 2023: పంజాబ్‌పై టాస్ గెలిచిన హైదరాబాద్.. బోణీ కొట్టేనా?

ABN , First Publish Date - 2023-04-09T19:16:07+05:30 IST

బలమైన పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో మరికాసేపట్లో జరగనున్న

IPL 2023: పంజాబ్‌పై టాస్ గెలిచిన హైదరాబాద్.. బోణీ కొట్టేనా?

హైదరాబాద్: బలమైన పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బౌలింగు ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన శిఖర్ ధావన్(Shikhar Dhawan) సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

మరోవైపు, నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా ద్వారా ఖాతా తెరవాలని, పరాభవాలకు చెక్ పెట్టాలని మార్కరమ్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ జట్టులోకి హెన్రిక్ క్లాసెన్, మయాంక్ మార్కండే జట్టులోకి వచ్చారు.

Updated Date - 2023-04-09T19:16:12+05:30 IST