Mohammed Shami: వరల్డ్‌కప్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షమీ.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్
ABN , First Publish Date - 2023-11-15T21:33:07+05:30 IST
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో..
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో.. షమీ ఈ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనూ షమీ 51 వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ అత్యంత వేగంగా అందుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. అతడు 19 ఇన్నింగ్స్‌ల్లో వరల్డ్‌కప్‌లో 50 వికెట్ల ఫీట్ సాధించాడు. ఇప్పుడు అతని కంటే రెండు తక్కువ ఇన్నింగ్స్‌లోనే (17) 50 వికెట్ల మార్క్‌ని దాటేసి, స్టార్క్‌ని షమీ వెనక్కు నెట్టేశాడు. ఇక వీళ్ల తర్వాత మలింగ (25 ఇన్నింగ్స్), ట్రెంట్ బౌల్ట్ (28 ఇన్నింగ్స్), గ్లెన్ మెక్‌గ్రాత్ (30 ఇన్నింగ్స్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ముఖ్యంగా.. ఈ మెగా టోర్నీలో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లీగ్ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడని అతగాడు.. న్యూజిలాండ్‌తో ఆడిన ఐదో మ్యాచ్‌కి మైదానంలో అడుగుపెట్టాడు. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి.. కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఇక అప్పటి నుంచి అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టి.. సింగిల్ ఎడిషన్‌లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన చారిత్రాత్మక రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.