NZ vs SL: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన లంక!
ABN , First Publish Date - 2023-03-20T12:22:32+05:30 IST
శ్రీలంక (Sri Lanka)తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్(New Zealand) క్లీన్ స్వీప్ చేసింది.
వెల్లింగ్టన్: శ్రీలంక (Sri Lanka)తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్(New Zealand) క్లీన్ స్వీప్ చేసింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో గెలిచిన కివీస్(Kiwis).. తాజాగా ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 580 పరుగులు చేయగా, ప్రతిగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆడింది.
రెండో ఇన్నింగ్స్‌లో కొంత పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (51), కుశాల్ మెండిస్ (50), దినేశ్ చండీమల్ (62) అర్ధ సెంచరీలతో రాణించగా ధనంజయ డి సిల్వ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. బ్యాటర్లందరూ రాణించినప్పటికీ కివీస్ బంతులను కాచుకోలేక పెవిలియన్ చేరారు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 358 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా మరో రోజు మిగిలి ఉండగానే శ్రీలంక చాప చుట్టేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నెర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, బ్రాస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఆతిథ్య కివీస్ 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు భారీ స్కోరు సాధించి డిక్లేర్ చేసింది. విలిమ్సన్ (215), హెర్నీ నికోలస్ (200) డబుల్ సెంచరీలు సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.