Share News

IND vs NZ: సెమీస్‌లో మనవాళ్లకు గాయాలే గాయాలు.. కానీ గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2023-11-15T18:12:14+05:30 IST

వరల్డ్‌కప్‌లో 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మన టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో మన భారతీయ కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వాళ్లే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.

IND vs NZ: సెమీస్‌లో మనవాళ్లకు గాయాలే గాయాలు.. కానీ గుడ్ న్యూస్!

వరల్డ్‌కప్‌లో 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మన టీమిండియాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో మన భారతీయ కీలక ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వాళ్లే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. తొలుత శుభ్‌మన్ గిల్‌ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అప్పటివరకూ మైదానంలో పరుగుల వర్షం కురిపించిన అతగాడు.. 79 వ్యక్తిగత పరుగుల వద్ద గాయపడ్డాడు. క్రీజు మధ్య పరుగులు తీస్తున్నప్పుడు అతడు ఒక్కసారిగా కండరాల నొప్పితో పడిపోయాడు. ఎంతసేపటికి నొప్పి తగ్గకపోవడంతో.. రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే.. చివర్లో బ్యాటింగ్ చేయడానికి తిరిగి రంగంలోకి దిగాడు. సూర్య ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సైతం అలాంటి గాయమే అయ్యింది. లెగ్ సైడ్‌లో ఒక షాట్ కొట్టబోతున్నప్పుడు కాస్త తిరగడంతో.. శుభ్‌మన్ తరహాలో కండరాల నొప్పికి గురయ్యాడు. కానీ.. ఆ వెంటనే అతడు తేరుకొని తిరిగి తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక చివర్లో 6 ఓవర్లు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. టిమ్ సౌథీ బౌలింగ్‌లో గాయపడ్డాడు. అతడు ఒక బంతిని నెమ్మదిగా వేయగా.. దాన్ని వేగాన్ని పసిగట్టేకపోయిన కేఎల్ రాహుల్ షాట్ కొట్టబోయాడు. అప్పుడది బంతి నేరుగా ఛాతికి తగిలింది. దీంతో అతడు కాసేపు ఇబ్బంది పడ్డాడు. అయితే.. ఆ వెంటనే మళ్లీ కోలుకొని, అతడు తన సత్తా చాటాడు. మన ముగ్గురు ప్లేయర్లు గాయాలపాలైనా.. వెంటనే కోలుకోవడం శుభపరిణామం.

Updated Date - 2023-11-15T18:12:16+05:30 IST