Virat Kohli: ఆర్సీబీ తరపున ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లీ అరుదైన రికార్డ్!

ABN , First Publish Date - 2023-04-24T17:53:04+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యంత అరుదైన

Virat Kohli: ఆర్సీబీ తరపున ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లీ అరుదైన రికార్డ్!

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ఫీల్డర్‌గా వంద క్యాచ్‌లు అందుకున్న తొలి ఆర్సీబీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడు కోహ్లీనే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ గోల్డెన్ డక్ అయినప్పటికీ మైదానంలో మాత్రం మెరుపులా కదిలాడు. రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని యువ సంచలనాలు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్‌ను పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరు ఔటైన తర్వాతే బెంగళూరు విజయం ఖాయమైంది.

ఈ రెండు క్యాచ్‌లతో కలిపి విరాట్ ఖాతాలో 101 క్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 228 మ్యాచుల్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఆల్‌ రౌండర్ కీరన్ పొలార్డ్ 103, సురేశ్ రైనా 109 (204) క్యాచ్‌లతో కోహ్లీ కంటే ముందున్నారు. ఇక, ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 46.50 సగటుతో 279 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 82 (నాటౌట్) కాగా, స్ట్రైక్ రేట్ 141.62.

Updated Date - 2023-04-24T17:53:04+05:30 IST