Virat Kohli: ఇవ్వగలిగితే తీసుకోవాల్సిందే.. లేకపోతే ఇవ్వొద్దు: గంభీర్‌తో గొడవ తర్వాత విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-05-02T16:57:07+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ (RCB)-లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య సోమవారం జరిగిన

Virat Kohli: ఇవ్వగలిగితే తీసుకోవాల్సిందే.. లేకపోతే ఇవ్వొద్దు: గంభీర్‌తో గొడవ తర్వాత విరాట్ కోహ్లీ

లక్నో: ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ (RCB)-లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ అభిమానులకు మజాను పంచడంతోపాటు ఆటగాళ్ల మధ్య విభేదాలకు కారణమైంది. లక్నో మెంటార్ గంభీర్‌ (Gautam Gambhir) పైకి కోహ్లీ దూసుకెళ్లడం, ఆటగాళ్లు కోహ్లీ (Virat Kohli)ని దూరంగా లాక్కెళ్లడం వంటివి మైదానంలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ (BCCI) ఇద్దరికీ జరిమానా విధించింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ చాలా దూకుడుగా కనిపించాడు. లక్నో వికెట్ పడిన ప్రతిసారీ కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతేకాదు, లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాతో కోహ్లీ గొడవకు కూడా దిగాడు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో బెంగళూరు అనూహ్య విజయం సాధించిన తర్వాత కోహ్లీ మరింతగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘ఈ విజయం చాలా మధురమైనది బాయ్స్. స్వీట్ విన్. లెట్స్ గో’’ అన్నాడు. ఆ తర్వాత కాసేపటికే ‘‘నువ్వు ఇవ్వగలిగితే, తీసుకోవాలి కూడా. అలా కానప్పుడు ఇవ్వొద్దు’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ విజయం చాలా ముఖ్యమైనదని, చాలా కారణాల వల్ల ఈ విజయం మధురంగా మారిందన్నాడు. మరీ ముఖ్యంగా లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. మనం సాధిస్తామని, విజయంతో ముగిస్తామని అందరూ విశ్వసించారని, ఇది చాలా గొప్ప విషయమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-05-02T16:58:35+05:30 IST