Mitchell Starc: మిచెల్ స్టార్క్ ఐపీఎల్ డీల్‌పై హర్భజన్ సింగ్ ఫన్నీ వీడియో
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:27 PM
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిని హర్భజన్ సింగ్ షేర్ చేశారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటివల జరిగిన ఐపీఎల్(IPL) 2024 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు స్టార్క్ ను రూ.24.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ వేలం సీజన్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచాడు. అలాంటి స్టార్క్ ఐపీఎల్ డీల్ అభిమానులనే కాకుండా మాజీ వెటరన్లను కూడా ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో తాజాగా ఇతనికి సంబంధించిన ఓ డబ్బింగ్ వీడియో సోషల్ చక్కర్లు కోడుతుంది. అయితే ఆ వీడియోను భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా(social media)లో షేర్ చేశారు. ఆ వీడియోలో మిచెల్ స్టార్క్ భారతీయుల నుంచి డబ్బు తీసుకోవడం ద్వారా వారు ప్రపంచ కప్‌లో వారిని ఓడిస్తారని చెప్పడం కనిపిస్తుంది. ఇది చూసిన క్రీడాభిమానులు అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. సూపర్ ఎడిటింగ్, వీడియో అదుర్స్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంత మంది అయితే వీడియో చాలా ఫన్నీగా ఉందని అంటున్నారు. అంతేకాదు ఈ వీడియోపై సురేష్ రైనా(suresh raina) కూడా స్పందించి నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నారు.
ఇక ఐపీఎల్‌లో స్టార్క్ చాలా ఎక్కువ ధరకు అమ్ముడుపోవడంతో అతనిపై అభిమానులతోపాటు ఫ్రాంచైజీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్టార్క్ తన ప్రదర్శనతో ఈ ఐపీఎల్‌లో తన ధరకు న్యాయం చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి మరి. అయితే IPL 2024 మార్చి 23 నుంచి మొదలవుతుందని నివేదికలు చెబుతున్నాయి.