Nathan Lyon: యాషెస్ రెండో టెస్ట్‌తో చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్

ABN , First Publish Date - 2023-06-28T16:00:45+05:30 IST

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 100 టెస్ట్ మ్యాచ్‌లాడిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Nathan Lyon: యాషెస్ రెండో టెస్ట్‌తో చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 100 టెస్ట్ మ్యాచ్‌లాడిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా వరుసగా 100 టెస్టులు ఆడిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.

లియోన్ కంటే ముందు ఐదుగురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించినప్పటికీ వారంత బ్యాటర్లే. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా లియోన్ రికార్డు నెలకొల్పాడు. కాగా లియోన్ కంటే ముందు మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్, అలన్ బార్డర్, మార్క్ వా, సునీల్ గవాస్కర్, బ్రెండన్ మెకల్లమ్ ఈ ఘనతను అందుకున్నారు. వరుసగా అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాళ్ల జాబితాలో 159 టెస్టులతో ఇంగ్లండ్ ఆటగాడు అలిస్టర్ కుక్ మొదటి స్థానంలో ఉన్నాడు.

Nathan-Lyon.jpg

కాగా 35 ఏళ్ల నాథన్ లియోన్ 2011లో ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు మొత్తంగా 121 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 495 వికెట్లు పడగొట్టాడు. మరొక 5 వికెట్లు తీస్తే 500 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లను సాధించిన ఎనిమిదో బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. అలాగే నాల్గో స్పిన్నర్‌గా నిలుస్తాడు. కాగా లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లోనే లియోన్ ఈ ఘనత అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే రెండో టెస్ట్ మ్యాచ్ అయిపోయేవరకు వేచిచూడాలి.

Updated Date - 2023-06-28T16:01:32+05:30 IST