IND vs PAK: 50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు.. విదేశాల్లో ఇషాన్ కిషన్ ఊచకోత!

ABN , First Publish Date - 2023-09-02T21:00:30+05:30 IST

50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి.

IND vs PAK: 50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు.. విదేశాల్లో ఇషాన్ కిషన్ ఊచకోత!

50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి. జట్టు ఏదైనా, పిచ్ ఎవరైనా, బౌలర్ ఎవరైనా సరే డొంట్ కేర్ అంటున్నాడు. తనదైన బ్యాటింగ్‌తో దుమ్ములేపుతున్నాడు. ఓపెనర్‌గా ఆడిన, మిడిలార్డర్‌లో ఆడిన సరే సునాయసంగా పరుగులు రాబడుతూ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. విదేశాల్లో ఇషాన్ కిషన్ ఆడిన చివరి 6 వన్డే మ్యాచ్‌లు ఇదే చెబుతున్నాయి. నిలకడ లేదంటూ కిషన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పలు మ్యాచ్‌ల్లో పక్కన పెట్టినప్పటికీ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించున్నాడు.


ఈ క్రమంలో విదేశాల్లో ఆడిన గత 6 వన్డేల్లో ఏకంగా 87 సగటుతో పరుగులు సాధించాడు. ప్రతి మ్యాచ్‌లో 50+ స్కోర్ సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండడం విశేషం. దీంతో ఇదొ రికార్డుగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో కిషన్ ఆడిన గత 6 వన్డేలను ఒక సారి గమనిస్తే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌‌లో 61 బంతుల్లో 50 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా 46 బంతుల్లో 52, 55 బంతుల్లో 55, 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇక నేడు శ్రీలంకలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు. మొదటి 5 ఇన్నింగ్స్‌లు ఓపెనర్‌గా ఆడినవి అయితే.. పాక్‌తో ఆడింది మిడిలార్డర్‌లో కావడం గమనార్హం. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు. ఈ క్రమంలో గత 6 వన్డేల్లో కిషన్ ఏకంగా 87 సగటుతో 526 పరుగులు చేశాడు. దీంతో జట్టులో తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలనని కిషన్ నిరూపించుకున్నాడనే చెప్పుకోవాలి. అంతేకాకుండా జట్టులో స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడని అనుకోవచ్చు.

Updated Date - 2023-09-02T21:04:01+05:30 IST