Home » IND vs PAK
భారత్, పాకిస్తాన్ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన గిల్ వికెట్ తీశాడు.
Virat Kohli: గత కొన్నాళ్లుగా పూర్ ఫామ్‌తో సతమతమవుతున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గాడిన పడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు స్టన్నింగ్ సెంచరీతో అదరగొట్టాడు.
పాకిస్తాన్ జట్టు వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం వారం రోజుల్లో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ కథ ముగిసింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాజయం పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం పాకిస్తాన్ అభిమానులను కుంగదీస్తోంది. భారత్ చేతిలో ఓటమి పట్ల పాక్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. పాక్ అభిమానులే కాదు.. ఆ దేశ మీడియా కూడా టీమిండియా విజయానికి వక్రభాష్యం చెబుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తోనూ, పాకిస్తాన్‌తోనూ జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుండగా, భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి వెళ్లడానికి టీమిండియా సిద్ధపడలేదు. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు.
దారుణ పరాజయంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వారికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీమ్ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.