India Second ODI: ప్రయోగాల బాటేనా..?

ABN , First Publish Date - 2023-08-01T04:19:12+05:30 IST

రెండో వన్డే(Second ODI)లో ఎదురుదెబ్బ తగిలినా.. ప్రయోగాలకు మాత్రం టీమిండియా(Team India) వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సిరీస్‌ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలోనూ మిడిలార్డర్‌లో శాంసన్‌(Samson), సూర్యకుమార్‌(Suryakumar)ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

India Second ODI: ప్రయోగాల బాటేనా..?

రాత్రి 7 గంటల నుంచి డీడీ, జియో సినిమాలో

ఒత్తిడిలో భారత్‌..

జోరుమీద విండీస్‌

రోహిత్‌, కోహ్లీలకు విశ్రాంతి!

సిరీస్‌ నిర్ణాయక మూడో వన్డే నేడు

టరోబా: రెండో వన్డే(Second ODI)లో ఎదురుదెబ్బ తగిలినా.. ప్రయోగాలకు మాత్రం టీమిండియా(Team India) వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సిరీస్‌ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలోనూ మిడిలార్డర్‌లో శాంసన్‌(Samson), సూర్యకుమార్‌(Suryakumar)ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దూరదృష్టితోనే బెంచ్‌ బలాన్ని పరీక్షిస్తున్నామని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Coach Rahul Dravid) స్పష్టం చేయడంతో.. రెండో వన్డేలో ఆడిన టీమ్‌నే మళ్లీ బరిలోకి దించే చాన్సులున్నాయి. అంటే సీనియర్లు రోహిత్‌, కోహ్లీకి మరోసారి విశ్రాంతినిచ్చినట్టే...! మూడు వన్డేల సిరీస్‌(Three ODI series) లో తొలి మ్యాచ్‌లో టీమిండియా నెగ్గగా.. రెండో వన్డేలో విజయం సాధించిన విండీస్‌ 1-1తో సిరీస్‌ ను సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్‌ వారిదే..! ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే 2006 తర్వాత తొలిసారి విండీస్‌(Windies) చేతిలో వన్డే సిరీస్‌ ను కోల్పోనుంది.


వన్డేల్లో తడబడుతున్న సూర్య కుదురుకొని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఎంతో ఉంది. వరల్డ్‌కప్‌ జట్టులో సూర్యకు చోటు దక్కితే అతడు మిడిలార్డర్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. దురదృష్టవంతుడు శాంసన్‌కు ఈ మ్యాచ్‌లోనైనా కలసొస్తుందేమో చూడాలి. ఓపెనర్‌గా ఇషాన్‌ అదరగొడుతుండగా.. గిల్‌, హార్దిక్‌ పాండ్యా బ్యాట్‌ నుంచి ఆశించిన మెరుపులు కనిపించలేదు. బౌలింగ్‌ విభాగానికొస్తే ఉమ్రాన్‌ మాలిక్‌ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనామెన్‌ కుల్దీప్‌ జట్టు నమ్మదగ్గ బౌలర్‌గా మారాడు. మరోవైపు రెండో వన్డేలో నెగ్గి జోరు మీదున్న విండీస్‌.. సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌ను ఓడించి సిరీస్‌ దక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉంది. బౌలర్లు గుడకేష్‌, షెఫర్డ్‌ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుండగా.. కెప్టెన్‌ షాయ్‌ బ్యాట్‌తో రాణించడం జట్టుకు ప్లస్‌. మొత్తంగా చూస్తే విండీస్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

జట్లు (అంచనా)

వెస్టిండీస్‌: బ్రాండన్‌ కింగ్‌, మేయర్స్‌, అథనజె, హోప్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హెట్‌మయెర్‌, కార్టీ, షెఫర్డ్‌, యానిక్‌ కరియా, జోసెఫ్‌, గుడకేష్‌ మోటీ, సీల్స్‌.

భారత్‌: ఇషాన్‌, గిల్‌, శాంసన్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), సూర్య, అక్షర్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, ఉమ్రాన్‌, ముకేష్‌.

Updated Date - 2023-08-01T04:52:16+05:30 IST