RajasthanVsPunjab: దుమ్మురేపిన పంజాబ్ ఓపెనర్లు.. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం ఎంతంటే..
ABN , First Publish Date - 2023-04-05T21:47:34+05:30 IST
అసోంలోని గువహటి వేదికగా మొట్టమొదటిసారి జరుగుతున్న ఐపీఎల్ (IPL) రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Rajasthan Royals vs Punjab Kings) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది...
గువహటి: అసోంలోని గువహటి వేదికగా మొట్టమొదటిసారి జరుగుతున్న ఐపీఎల్ (IPL) రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Rajasthan Royals vs Punjab Kings) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్ (60), శిఖర్ ధావన్ (86 నాటౌట్) రాణించడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది. ముఖ్యంగా పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ దూకుడుకు రాజస్థాన్ బౌలర్లు కళ్లెం వేయలేకపోయారు. అతడు చెలరేగి ఆడి కేవలం 34 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ధావన్‌తో కలిసి జట్టు స్కోరును వేగంగా ముందుకు నడిపాడు. పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. భానుక రాజపక్స (1), జితేష్ శర్మ (27), సికందర్ రాజా (1), షారుఖ్ ఖాన్ (11), సామ్ కరాన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తొలి వికెట్ పడగొట్టేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. 90 పరుగుల వద్ద తొలి వికెట్ దక్కింది. జాసన్ హోల్డర్ 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ చొప్పున తీశారు.