Sunil Gavaskar: 'అద్భుతమైన అవకాశం మిస్ అయిందంటూ' టెస్ట్ జట్టు ఎంపికపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-06-24T16:22:12+05:30 IST
వెస్టిండీస్ (West Indies) జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా (India) జట్టు ఎంపికపై టీం ఇండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు."
వెస్టిండీస్ (West Indies) జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా (India) జట్టు ఎంపికపై టీం ఇండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు."అద్భుతమైన అవకాశం మిస్ అయింది" అని మండిపడ్డారు. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు.
అయితే పుజారా, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేష్ కుమార్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. జయదేవ్ ఉనద్కత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నవదీప్ సైనీని కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టులోకి తీసుకున్నారు. ఈ రెండు మ్యాచ్‌లకు కొంతమంది యువకులను ఎంపిక చేయగా, రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‌లతో జట్టు పటిష్టంగా లేదని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో టెస్టులకు ఎక్కువ మంది యువకులకు అవకాశం ఇవ్వకపోవడంతో టీమ్ ఇండియా "అద్భుత అవకాశాన్ని" కోల్పోయిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది అక్టోబరు-నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌ను ఆడాలని భావిస్తున్న ఆటగాళ్లు వైట్‌బాల్ క్రికెట్ ఆడటంపై మాత్రమే దృష్టి సారించాలని క్రికెట్ గవాస్కర్ సూచించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోయిందని, ఇప్పుడు తదుపరి విషయం ఏమిటంటే అక్టోబర్‌లో జరిగే (ODI) ప్రపంచ కప్‌పై దృష్టిపెట్టాలని, టెస్ట్ క్రికెట్ నుంచి పూర్తి విరామం ఇవ్వాలని తాను కోరుకున్నానని గవాస్కర్ అన్నారు.
ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ కాకుండా వైట్ బాల్ క్రికెట్‌ను మాత్రమే చూడాలన్నారు. వరల్డ్ కప్ ఆడేందుకు నిశ్చయించుకున్న వారికి పూర్తి విరామం ఇవ్వాలని, వారు 3-4 నెలలుగా నాన్‌స్టాప్ క్రికెట్ ఆడుతున్నారని, వారికి విరామం లభించలేదని గవాస్కర్ తెలిపాడు. ప్రతి సీనియర్ ఆటగాడికి విరామం ఇచ్చి మరికొంత మంది యువ ఆటగాళ్లను ఆడించి ఉంటే, భారత క్రికెట్‌కు మంచి విజయాన్ని అందించేవారని, కానీ పాపం అలా జరగలేదని, ఒక అద్భుతమైన అవకాశం మిస్ అయినట్లు తాను భావిస్తున్నానని గవాస్కర్ అన్నారు.