IPL 2023 Playoff Scenario: ఆర్సీబీ చేతిలో చివరి 2 మ్యాచ్‌లు.. సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోతే.. ప్లే ఆఫ్స్ పరిస్థితేంటంటే..

ABN , First Publish Date - 2023-05-18T17:01:57+05:30 IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెరుగైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీకి కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

IPL 2023 Playoff Scenario: ఆర్సీబీ చేతిలో చివరి 2 మ్యాచ్‌లు.. సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోతే.. ప్లే ఆఫ్స్ పరిస్థితేంటంటే..

ఐపీఎల్ 2023 (IPL2023) సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకుంది. ఇంకో 6 మ్యాచ్‌లే మిగిలివున్నప్పటికీ ప్లే ఆఫ్స్ ఆడబోయే జట్లేవో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు ఒక్క గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) మాత్రమే అధికారికంగా అర్హత సాధించింది. మిగతా మూడు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెరుగైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీకి కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరగనున్న ఈ పోరు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) అత్యంత కీలకమైనది. గత మ్యాచ్‌లో బౌలర్లు కీలక పాత్ర పోషించడంతో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. ఫలితంగా పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అందుకే 2 మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్రధాన పోటీదారుగా ఉంది.

ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి 16 పాయింట్లతో ఉంటే ముంబై నుంచి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ముంబై చేతిలో మరొక్క మ్యాచ్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్ సేనకు చేతిలో కూడా 16 పాయింట్లు ఉంటాయి. కాబట్టి ఒక ప్లే ఆఫ్ స్థానం కోసం ఆర్సీబీ, ముంబై పోటీపడతాయి. రెండు జట్లూ సమానమైన పాయింట్లతోనే ఉంటే నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ చివరి రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో ఓడిపోయినా ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఒకవేళ ముంబై తన చివరిలో మ్యాచ్‌లో ఓడిపోయి.. ఆర్సీబీ కూడా ఒకే మ్యాచ్‌లో విజయం సాధిస్తే 14 పాయింట్లతో ఉంటే జట్ల మధ్య ఒక స్థానం కోసం పోటీ నెలకొంటుంది. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాంటి సమీకరణం ఏర్పడితే నెట్ రన్ రేట్ అత్యంత కీలకమవనుంది.

కాబట్టి ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ స్థానాలు ఖరారవ్వాలంటే హైదరాబాద్ ఆడబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకమవనున్నాయి. సన్‌రైజర్స్ తన చివరి 2 మ్యాచుల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Updated Date - 2023-05-18T17:01:57+05:30 IST