WTC Final Australia vs India: హెడ్ సెంచరీ, స్మిత్ అర్థ సెంచరీతో పరుగులు పెడుతున్న ఆసీస్ స్కోర్

ABN , First Publish Date - 2023-06-07T21:50:08+05:30 IST

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూసుకుపోతున్నారు.

WTC Final Australia vs India: హెడ్ సెంచరీ, స్మిత్ అర్థ సెంచరీతో పరుగులు పెడుతున్న ఆసీస్ స్కోర్

లండన్: కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూసుకుపోతున్నారు. స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారిస్తున్నారు. ట్రావిస్ హెడ్ సెంచరీతో దూసుకుపోగా, స్టీవెన్ స్మిత్ అర్థ సెంచరీ చేయడంతో ఆసీస్ స్కోరు పరుగులు పెడుతోంది. 126 బంతుల్లో ట్రావిస్ హెడ్ 111 పరుగులు చేశాడు. స్టీవెన్ స్మిత్ 181 బంతుల్లో 75 పరుగులు చేశాడు.

ప్రస్తుతం 72.3 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. టీం ఇండియా ఫీల్డర్లకు బంతి చిక్కకుండా మైదానం నలువైపులా పరుగులు పెట్టిస్తూ ఆసీస్ స్కోర్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు.

తొలి సెషన్‌లో 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు భోజన విరామం సమయానికి 23 ఓవర్లలో 73 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం రెండో సెషన్ ప్రారంభంలోనే మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడింది. ఆసీస్ టీ విరామం సమయానికి 51 ఓవర్లలో 170 పరులు చేసింది.

రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారత (India) బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు. షమీ బౌలింగ్‌లో మార్నస్ లాబుషేన్ బౌల్డ్ అయ్యాడు. మార్నస్ లాబుషేన్ 62 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 24.1 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 76 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది.

60 బంతుల్లో డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేశాడు. ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఉస్మాన్ ఖవాజా 10 బంతులు ఆడి పరుగులు రాబట్టకపోగా.. సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Updated Date - 2023-06-07T21:53:54+05:30 IST