AI Cooking: వంటకి సరుకులు తక్కువయ్యాయా? అయినా నో ఫికర్

ABN , First Publish Date - 2023-04-04T20:16:58+05:30 IST

ఎందుకంటే మనం ఒకోసారి... మనకి టైమ్‌ ఉండక.. ఐదు పది నిమిషాల్లో లేదా పావుగంలో వంట ముగించేయాలనుకుంటాం. కానీ ఒక్కోసారి...

AI Cooking: వంటకి సరుకులు తక్కువయ్యాయా? అయినా నో ఫికర్

ఈ మధ్య కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటింట్లోకి కూడా దూసుకొచ్చేసింది. కిచెన్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్లలో ఎఐ వచ్చేసింది. ఎఐ సాయంతో ఫ్రిజ్‌లూ ఓవెన్లూ సైతం వంటకు సంబంధించి అద్భుతమైన సలహాలు ఇస్తున్నాయి. అయితే ఇలాంటి డివైజ్‌లు ఇంకా అందుబాటు ధరల్లో లేవు. అయితే మంచి వంట సలహాలు ఇవ్వగలిగే ఎఐ టూల్స్ మాత్రం ఫ్రీ గానే దొరుకుతున్నాయి. కొద్దిపాటి ప్రైస్‌తో ఇవి అద్భుతమైన సలహాలు ఇస్తున్నాయి. అలాంటి కిచెన్‌ టూల్స్‌లో ఒకటి షెఫ్‌ జీపీటీ !

67f81df2-61dd-4ec9-bb42-6d3cf34a2eba.jpg

ఈరోజు వంటకి ఏం చేయాలి? అన్నది ప్రతిరోజూ చాలామందికి ఎదురయ్యే సమస్య. సింపుల్‌ సమస్యే అనిపిస్తుందిగానీ.. దీంట్లో చికాకులు ఉన్నాయి. ఎందుకంటే - ఇంట్లో ఉన్న కూరగాయల్ని దృష్టిలో ఉంచుకొని, వంట చేయడానికి మనకు ఉన్న టైమ్‌‌ని పరిగణనలోకి తీసుకుని ఈ రోజుకి ఏం చేయాలి అన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇకపైన మనం ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేశాయ్.

షెఫ్‌ జీపీటీ ( Chef GPT) అనే ఒక చిన్న రెసిపీ టూల్‌... ఇప్పుడు ప్రతిరోజూ వంటలో మనకి హెల్ప్ చేస్తుంది. అది నేరుగా వంట చేయదు గానీ... ఏం వండాలో వెంటనే మనకి ఐడియా ఇస్తుంది. ChefGPT.xyz సైట్‌లోకి మన గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి ఈ టూల్‌ని ఉపయోగించుకోగలుగుతాం.

252.jpg

దీంట్లో అనేక మోడ్స్‌ ఉన్నాయి. ప్యాంట్రీ షెఫ్‌ మోడ్‌ (Pantry Chef) , మాస్టర్ షెఫ్‌, మ్యాక్రోస్‌ షెప్‌, మీల్‌ ప్లాన్‌ షెఫ్‌, పెయిర్‌ పర్ఫెక్ట్ ...ఇలా చాలా ఉన్నాయి. బేసిక్‌ మోడ్‌ అయిన Pantry Chef ని మాత్రం ట్రయల్‌గా.. 7 రోజులపాటు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. తరవాత కూడా... ఫ్రీ వెర్షన్ ఉపయోగపడుతుంది. నెలకి 5 రెసిపీస్ విషయంలో ఫ్రీగా సలహా తీసుకోవచ్చు. నిజానికి దీంట్లో ప్రో వెర్షన్‌ కూడా మరీ కాస్ట్‌లీ ఏమీ కాదు. ఖర్చు కేవలం 2.9 డాలర్లు మాత్రమే.

షెఫ్‌ జీపీటీ ఎఐ టూల్‌ వాడడం చాలా సులువు. ఇది ఒక ఫామ్ ఫిల్ చేసినట్టుగా సింపుల్ గా ఉంటుంది. వంట సలహా తీసుకోవాలంటే... ముందుగా మనం కొన్ని చెప్పాలి. మన దగ్గర వంట చేయడానికి ఏమేమి ఇన్‌గ్రేడియెంట్స్‌ ఉన్నాయి.. అవి ఎంతెంత పరిమాణంలో ఉన్నాయి అన్న వివరాలు ఇవ్వాలి. ఉంటుంది ఉదాహరణకి 100 గ్రాములు బటర్ ... 200 గ్రాముల పాలు ... హాఫ్‌ కిలో వంకాయలు... ఇలా మన దగ్గర ఏం ఉన్నాయో లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం వంటింట్లో ఎటువంటి కిచెన్‌ టూల్స్‌ వాడుతున్నాం అన్నది కూడా చెప్పాలి. అంటే... మైక్రోవేవ్‌ ఓవెన్ వాడుతున్నామా...... ఎయిర్ ఫైర్ డివైజ్‌ వాడుతున్నామా ... బీబీక్యూ సిస్టమ్‌ వాడుతున్నామా... ఇలాంటి వివరాలు చెప్పాలి. వీటిని బట్టి షెఫ్‌ జీపీటీ ఎఐ టూల్‌... ఎలాంటి వంటకం చేస్తే బెటర్‌ అనే సలహా ఇస్తుంది.

708bcf6d-bcd7-4c1b-a7be-e5bca306d0d9.jpg

అన్నట్టు మనకి వంట చేయడానికి ఎంత టైమ్‌ ఉంది అన్నది కూడా దీనికి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒకోసారి... మనకి టైమ్‌ ఉండక.. ఐదు పది నిమిషాల్లో లేదా పావుగంలో వంట ముగించేయాలనుకుంటాం. కానీ ఒక్కోసారి తీరిక ఎక్కువ దొరుకుతుంది. ఇలా టైమ్‌ని బట్టి కూడా బట్టి కూడా వంట విషయంలో ఏఐ ఇంజన్ సలహా ఇవ్వగలుగుతుంది. ఇక మీ వంట ప్రావీణ్యం ఎంత అన్నది కూడా ఇక్కడ చెప్పాలి. దాన్ని బట్టి సులువైన వంటలు చెప్పాలా? కష్టమైన వంటలు చెప్పాలా అన్నది ఇంజన్‌ చూసుకుంటుంది.

ఇక షెఫ్‌ మోడ్స్‌ ఉంటాయి. ఉదాహరణకి గార్మెట్‌ మోడ్‌ ఉంది. ఈ మోడ్‌ ఎంచుకుంటే... మన దగ్గర ఉన్న వస్తువులు అన్నిటినీ వంటలో వాడమని చెప్పదు. వంటకి సరిపోని కొన్నిటిని పక్కకి తీసివేసి ఆప్షన్స్‌ ఇస్తుంది. అయితే ఆల్‌ ఇన్‌ అని... మరో మోడ్‌ ఉంది... అది సెలక్ట్‌ చేసుకుంటే... ఉన్న వస్తువుల్లో అన్ని రకాల్నీ ఉపయోగించుకుని కొత్త కొత్త వంటల్ని క్రియేట్ చేసే ఆప్షన్స్‌ ఇస్తుంది ఎఐ ఇంజిన్‌.

bba49ae2-fbd9-4ded-9d08-66bf505b6e2e.jpg

ఫైనల్‌గా జనరేట్ యువర్‌ రెసిపీ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ... ఏ వంట చేయాలో ఇది రికమెండ్‌ చేస్తుంది. అది మాత్రమే కాదు.. ఆ ఫలానా వంట చేయడానికి మనకి ఎంత టైమ్‌ పడుతుంది? దాంట్లో కష్టం ఎంత? ఇన్‌గ్రేడియెంట్స్‌ ఏమేం వాడాలి? వంటింటి టూల్స్ వేటితో పనిపడుతుంది? ఇవన్నీ చెబుతుంది. అంతే కాదు.. వంట ఎలా వండాలో వివరాలు ఇస్తుంది. ఫైనల్‌గా ఆ పదార్థంలో ఉండే పోషక పదార్థాల వివరాలు కూడా ఇది అందిస్తుంది.

షెఫ్‌ జీపీటీ క్రియేట్ చేసిన రెసిపీల్ని మనం ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు.

అలాగే వంటింట్లో అయిపోయిన వస్తువుల్ని ఇది గుర్తు చేస్తుంది. అందువల్ల వాటిని ఎప్పటికప్పుడు కొని సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఈ టూల్‌లో బేసిక్ మోడ్ పూర్తిగా ఉచితం. కానీ కాస్త పే చేసి ఫుల్‌ ఫీచర్స్‌ వాడితే ఇది ఎంతో మంచి టూల్‌.

షెఫ్‌ జీపీటీ (Chef GPT)ని ఒకసారి వాడి చూడండి. ఈ కాలంలో వంటింట్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా దూసుకు వస్తోందో... ఇది వాడితే మనకి అర్థమవుతుంది.

6afda4be-9362-4d95-bbc6-a8f612d7a642.jpg

Updated Date - 2023-04-04T20:17:30+05:30 IST