AI music tool: ఏఐ ఉంటే చాలు.. ఎలాంటి పాటయినా ఇట్టే రెడీ!.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ABN , First Publish Date - 2023-04-27T17:57:32+05:30 IST
ఏఐ మ్యూజిక్ టూల్స్ (AI Music tools) ఇప్పుడు కేవలం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ని (Instrumental music) మాత్రమే కాదు.. క్రియేటివ్ సాంగ్స్‌ని కూడా ఇవ్వగలుగుతున్నాయి. స్వరాలు మాత్రమే కాకుండా... మనిషి పాడుకునే విధంగా... భావంతో రాగంతో సహా పాటల్ని ఇచ్చేస్తున్నాయి. అంతే కాదు... పాటకి తగిన లిరిక్స్‌ని కూడా ఏఐ ఇంజిన్సే రాసేస్తున్నాయి.
ఏఐ మ్యూజిక్ టూల్స్ (AI Music tools) ఇప్పుడు కేవలం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ని (Instrumental music) మాత్రమే కాదు.. క్రియేటివ్ సాంగ్స్‌ని కూడా ఇవ్వగలుగుతున్నాయి. స్వరాలు మాత్రమే కాకుండా... మనిషి పాడుకునే విధంగా... భావంతో రాగంతో సహా పాటల్ని ఇచ్చేస్తున్నాయి. అంతే కాదు... పాటకి తగిన లిరిక్స్‌ని కూడా ఏఐ ఇంజిన్సే రాసేస్తున్నాయి. నిజం చెప్పాలంటే.. క్రమంగా సంగీతరంగాన్ని కూడా ఏఐ టూల్స్ హైజాక్ చేస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది.
చాట్ జీపీటీ (ChatGpt) రూపొందించిన ఓపెన్ ఏఐ (Open AI) వాళ్లు తయారు చేసిన మ్యూజిక్ టూల్ ఉంది. దీని పేరు జ్యూక్ బాక్స్. ఇది జనరల్‌గా మనందరం అనుకునే ప్లేలిస్ట్ టైప్ జ్యూక్ బాక్స్ కాదు. ఇది పాటల్ని క్రియేట్ చేసే ఏఐ జ్యూక్ బాక్స్(AI juke box). దీని ప్రత్యేకత ఏంటంటే... ఇది కేవలం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాత్రమే కాదు.. మామూలు పాటల్ని కూడా అందించగలుగుతుంది.
దీనికి ఒక ఫలానా మ్యూజిక్ ఆర్టిస్ట్ పేరుచెప్పి.. అంటే ఎవరైనా ఒక సంగీత విద్వాంసుడి పేరు చెప్పి ఫలానా స్టైల్ కావాలని చెప్పి... ఏదైనా పాటని రాసి inputగా అందిస్తే తనకున్న నాలెడ్జ్‌తో... తనకున్న సమాచారంతో ఆ Text ని భావరాగాలు కలిగిన పాటగా అందించేస్తుంది. అంటే - స్క్రాచ్ నుంచి ఒక మ్యూజిక్ శాంపుల్‌ని తయారు చేసి ఇచ్చేస్తుందన్నమాట. మ్యూజ్ నెట్ అనేది కేవలం మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్స్‌ని మాత్రమే అందించగలిగితే ఈ జ్యూక్‌బాక్స్... సింగింగ్ ఆడియోను కూడా అందించేస్తుంది. అయితే ఇది ఇచ్చే అవుట్‌పుట్ కొంత Raw Audio అని చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ వివిధ రకాల ఆర్టిస్టుల స్టైల్‌లో ఇది సంగీతాన్ని అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది.
ఎన్నో రకాల మ్యూజిక్స్‌ని... ఎన్నో రకాల సింగింగ్ స్టైల్స్‌ని కూడా జూక్‌బాక్స్ క్రియేట్ చేయగలుగుతుంది. గొప్ప విశేషం ఏంటంటే... ట్రైనింగ్ టైమ్‌లో మనం అందించని సంగీతాన్ని కూడా ఇది కొత్తగా రూపొందించగలుగుతుంది. దీని సామర్థ్యానికి తోడు ... ఓపెన్ ఏఐ రీసెర్చ్ వాళ్లు దీనికి ఒక టెక్స్ట్ క్రియేషన్ టూల్‌ని కూడా జత చేశారు. అందువల్ల ఈ మ్యూజిక్ క్రియేట్ చేసేటప్పుడే దానికి తగిన లిరిక్స్‌ని టెక్స్ట్‌గా ఇది రాసుకుని.... ఫైనల్‌గా పాట అందించేస్తుంది. అలాగే ఇమేజ్ నుంచి ఇమేజెస్ తయారుచేసే AI టూల్స్ మాదిరిగానే - ఒక పాటను బట్టి మళ్లీ కొత్త పాటలు తయారు చేయగలిగే సామర్థ్యం కూడా దీనికి ఉంది. వీటినే re-renditions అంటారు.
జనరేటివ్ ఇమేజ్ ఏఐ టూల్స్ కొన్ని... ఇమేజ్‌లో కొంత భాగం ఇచ్చి మిగతా పెయింటింగ్ పూర్తిచేయమంటే చేసేస్తాయి. అలాగే ఇక్కడ కూడా మ్యూజిక్‌లో కొంత భాగాన్ని ఇచ్చి మిగిలిన పాట అంతా పూర్తి చెయ్యమని అడిగితే... అదే స్టైల్‌లో పాటని పూర్తి చేస్తుంది ఈ జూక్‌బాక్స్. నిజానికి జూక్‌బాక్స్ ఎన్నో ఏళ్ల క్రితమే రూపొందింది. ఏఐకి ప్రాధాన్యం పెరిగిన ఈ సీజన్‌లో దీన్ని మరింతగా డెవలప్ చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక రకాల మ్యూజిక్ స్టయిల్స్... వాటిలో పాపులర్ అయిన మ్యూజిక్ క్రియేటర్స్‌ని వీళ్లు మ్యాప్ చేసి ఈ టూల్‌కి అందించారు. ఒక్కసారంటూ ఒక స్టయిల్ క్రియేట్ అయితే ఇక ఆ స్టయిల్‌లో మనం ఎన్ని పాటలనైనా తయారు చేసుకోగలిగే అవకాశాన్ని ఈ జ్యూక్ బాక్స్ మనకి అందిస్తుంది. అందుకే ఇది... కచ్చితంగా మ్యూజిక్ క్రియేటర్స్ కి ఎంతో ఉపయోగపడే టూల్ గా మారబోతోంది. మొత్తం మీద ఈ సీజన్లో మ్యూజిక్ రంగంలోకి కూడా... ఎఐ టూల్స్ దూసుకువస్తున్నాయన్నది నిజం.
ఇవి కూడా చదవండి...
SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..
**************************************