Disney Layoff: డిస్నీ షాకింగ్ నిర్ణయం.. మరో 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
ABN , First Publish Date - 2023-04-25T19:15:06+05:30 IST
ఎంటర్‌టైన్‌మెంట్ డిస్నీషాకింగ్ నిర్ణయం తీసుకోనుందా..? మరో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం నిజమే అనిపిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ షాకింగ్ నిర్ణయం తీసుకోనుందా..? మరో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం నిజమే అనిపిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందు ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్నీ కూడా ఇదే బాట పట్టింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ఖర్చులలో 5.5 బిలియన్ల డాలర్లను తగ్గించుకునేలా ప్లాన్ చేస్తోంది. అయితే రెండవ రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను సంస్థ ప్రారంభించింది. అయితే ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న 4 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని తెలుస్తోంది.
రెండవరౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియతో డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్పీఎన్, డిస్నీ పార్క్స్ ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. రాబోయే మూడవ రౌండ్ తొలగింపులు వేసవి ప్రారంభానికి ముందే ప్రారంభమవుతాయని సీఎన్‌బీసీ రిపోర్ట్ పేర్కొంది. ఉద్యోగాల తొలగింపుతో దేశవ్యాప్తంగా కాలిఫోర్నియా, బర్‌బ్యాంక్, న్యూయార్క్ సంస్థలపై ప్రభావం పడనుంది. 7,000 ఉద్యోగాలను తగ్గించడం ద్వారా తన శ్రామిక శక్తిని తగ్గించాలని చూస్తోందని వెల్లడించింది. వాల్ట్ డిస్నీ కంపెనీ సీఈవో (CEO) బాబ్ ఇగెర్ మాట్లాడుతూ తాను ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోనని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.