Flipkart Big Billion Days: అగువకే కాస్ట్ లీ ఫోన్.. ఇప్పుడు మిస్సైతే మళ్లీ కొనలేరు!
ABN , First Publish Date - 2023-09-27T15:55:08+05:30 IST
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్ సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days) సువర్ణవకాశంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కోసం ఎదురుచూసేవారు ఉన్నారనడంలో అతిశయోశక్తి లేదు. పైగా ముందు ముందు దసరా, దీపావళి పండుగలు కూడా ఉండడంతో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ కాస్ట్‌లీ వస్తువులను వీలైనంత తక్కువ ధరలో అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సారి నథింగ్ ఫోన్(1)పై(Nothing Phone (1) ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్ ఇవ్వనుంది. సాధారణ రోజుల్లో ఈ ఫోన్ ధర రూ.28,999, రూ.26,999గా ఉంటుంది. 8జీబీ రామ్+256జీబీ స్టోరేజ్ గల నథింగ్ ఫోన్(1) రూ.28,999 కాగా.. 8జీబీ రామ్+128జీబీ స్టోరేజ్ గల నథింగ్ ఫోన్(1) ధర రూ.26,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్‌లో ఈ ఫోన్ రూ.25 వేల లోపు ధరకే రాబోతుంది. బిగ్ బిలియన్ డేస్‌లో ఈ ఫోన్‌పై రూ.3 వేలు డిస్కౌంట్ లభించనుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం బ్యాంక్ ఆఫర్లు అన్ని కలుపుకుని ఈ ఫోన్ రూ.23 వేలకే వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభంకానున్నాయి. కాబట్టి ఆ రోజు నథింగ్ ఫోన్(1) డిస్కౌంట్ ధరపై పూర్తి స్పష్టత రానుంది.
ఫీచర్లు
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. ఒకటి 8 జీబీ రామ్ + 128 జీబీ స్టోరేజీ మొబైల్ కాగా.. మరొకటి 8 జీబీ రామ్+256 స్టోరేజ్‌తో అందుబాటులో ఉండనుంది. 120Hz అధిక రిఫ్రెష్ రేట్ కల్గిన 6.55 అంగుళాల OLED డిస్‌ప్లేతో ఉండనుంది. విజువల్స్ స్పష్టంగా కనిపించడానికి HDR10+ సపోర్ట్ ఉంది. ముందు, వెనుక ప్యానెల్‌లలోని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మొబైల్‌ను రక్షిస్తుంటుంది. Qualcomm Snapdragon 778జీ+ ప్రాసెసర్ ఉండనుంది. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 4500mAhగా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ ప్యాకెజీలో ఛార్జర్ లేదనే విషయం గమనించాలి. ఇక ప్రధానంగా కెమెరా విషయానికొస్తే 50MP + 50MP బ్యాక్ కెమెరా.. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఏది ఏమైనా ఈ నథింగ్ ఫోన్(1)ను తక్కువ ధరకే కొనాలనుకునేవారికి బిగ్ బిలియన్ డేస్ మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు.