Flipkart offers: ఆఫర్లు అయిపోతున్నాయ్.. అన్ని సిరీస్‌ల ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చిన ఫ్లిప్‌కార్టు

ABN , First Publish Date - 2023-06-25T17:04:44+05:30 IST

ఒక మంచి ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడున్న భారీ ధరలను చూసి వెనక్కి తగ్గారా? ఆఫర్లు ఉన్నప్పుడు కొందామని ఆగారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు ‘‘బిగ్ బచత్ ధమాల్ సేల్’’ (Big Bachat Dhamaal Sale) పేరుతో ఆన్‌లైన్‌లో ఐ ఫోన్లపై (iPhones) భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 12 వంటి ఇతర యాపిల్ ఫోన్లపై (Apple devices) భారీగా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో వాటి అసలు రేటు కన్నా ఐ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ కోరిన విధంగా సంబంధిత కార్డులు మీ దగ్గర ఉంటే ఐ ఫోన్‌లు మరింత చౌకగా మీ సొంతం చేసుకోవచ్చు.

Flipkart offers: ఆఫర్లు అయిపోతున్నాయ్.. అన్ని సిరీస్‌ల ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చిన ఫ్లిప్‌కార్టు

ఒక మంచి ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడున్న భారీ ధరలను చూసి వెనక్కి తగ్గారా? ఆఫర్లు ఉన్నప్పుడు కొందామని ఆగారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు ‘‘బిగ్ బచత్ ధమాల్ సేల్’’ (Big Bachat Dhamaal Sale) పేరుతో ఆన్‌లైన్‌లో ఐ ఫోన్లపై (iPhones) భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 12 వంటి ఇతర యాపిల్ ఫోన్లపై (Apple devices) భారీగా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో వాటి అసలు రేటు కన్నా ఐ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ కోరిన విధంగా సంబంధిత కార్డులు మీ దగ్గర ఉంటే ఐ ఫోన్‌లను మరింత చౌకగా మీ సొంతం చేసుకోవచ్చు.

Flipkart-logo.png

ఐ ఫోన్ 13పై రూ. 12 వేల ఆఫర్

ఆఫర్‌లో (Flipkart offers) భాగంగా ప్రస్తుతం ఐ ఫోన్ 13 ( iPhone 13) ధర ఫ్లిప్‌కార్టులో రూ.58,499గా ఉంది. ఐసీసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు (ICICI bank credit card) ఉంటే మరో రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. అంటే ఐ ఫోన్ 13 మొబైల్ 57,499కే రానుంది. ఇవే కాకుండా ఇతర కార్డుల ద్వారా కూడా ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ఐ ఫోన్ ప్రారంభ ధర రూ.69,900. అంటే ‘‘బిగ్ బచత్ ధమాల్ సేల్’’ ఆఫర్‌లో భాగంగా దాదాపు 12 వేల రూపాయలు తక్కువకు వస్తోంది.

US-APPLE-FACES-SHORTAGES-IN-IPHONE-SUPPLIES-AMID-T_1674874837587_1674874837763_1674874837763.avif

లక్ష రూపాయల ఐ ఫోన్ 14 ప్రోపై భారీ ఆఫర్

ఒక వేళ లక్ష రూపాయలకు మించి వెచ్చించగలం అనుకుంటే మీకు ఐ ఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) బెస్ట్ ఛాయిస్. 128జీబీ (128GB) స్టోరేజ్ కల్గిన ఐ ఫోన్ 14 ప్రో ధర నిజానికి 1,29,900. కానీ ఆఫర్‌లో రూ.1,19,999 కే రాబోతుంది. అంటే 5జీ ఫోన్ ధర 9,901 తగ్గనుంది. మీ దగ్గరు హెడ్ఎఫ్‌సీ క్రెడిట్ (HDFC Bank Credit Card) లేదా డెబిట్ కార్డు (HDFC Bank Debit Card ) ఉంటే దీని ధర మరో 3 వేల రూపాయలు తగ్గనుంది. అంటే రూ.1,16,999 పరుగులకే రానుంది. ఈ ఐ ఫోన్ 14 సిరీస్‌లో మరో మాడల్ కూడా ఉంది. అదే ఐ ఫోన్ 14 ప్రో మాక్స్ (iPhone 14 Pro Max). ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్టు ఆఫర్‌లో భాగంగా రూ.1,27,999 అందుబాటులో ఉంది. 128జీబీ స్టోరేజ్ కల్గిన ఈ మాడల్ ధర నిజానికి రూ. 1,39,900. కానీ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్‌లో భాగంగా దాదాపు రూ.12,000 తగ్గనుంది. ఐ ఫోన్ 14 ప్రో మాదిరిగానే ఇది కూడా మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉంటే మరో 3 వేలు తగ్గనుంది. రూ. 1,24,999కే రానుంది. అంటే మొత్తంగా 15 వేల రూపాయల డిస్కౌంట్ లభించనుంది.

iphone-lineup-2022-1663709827.jpg

80 వేల లోపు ఐ ఫోన్లు ఇవే!

ఇంత ధర కాకుండా ఐ ఫోన్ 14 సిరీస్‌లోనే 80 వేల లోపు ధరతో కావాలనుకుంటే ఐ ఫోన్ 14 ప్లస్ ( iPhone 14 Plus) మొబైల్ అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం ఐ ఫోన్ 14 ప్లస్ ధర ఫ్లిప్‌కార్టులో రూ. 79,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉన్నట్టైతే మరో 4 వేలు తగ్గనుంది. అంటే రూ. 75,999కే రానుంది. నిజానికి ఐ ఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900. కానీ ఆఫర్‌లో దాదాపు 15 వేల వరకు తగ్గుతుంది. ఒకవేళ 60 వేల రూపాయల లోపే కావాలనుకుంటే ఐ ఫోన్ 12 ( iPhone 12) అందుబాటులో ఉంది. 64 జీబీ స్టోరేజ్ గల ఈ మొబైల్ ధర ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం రూ.53,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉంటే మరో 2 వేల రూపాయలు తగ్గనుంది. అంటే రూ. 51,999కే రానుంది. నిజానికి ఐ ఫోన్ 12 ధర రూ.59,900గా ఉంది. కానీ ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా దాదాపు 8 వేల రూపాయల డిస్కౌంట్‌లో లభించనుంది.

104535-mzlbjtbhqt-1541071027.jpg

ఈ ఐ ఫోన్ ధర 40 వేలే!

ఎంత ఐ ఫోన్ అయితే మాత్రం తాము ఇన్ని డబ్బులు పెట్టలేం, మా దగ్గర రూ.40 వేలు మాత్రమే ఉన్నాయనుకునేవారు కూడా ఫ్లిప్‌కార్టు పుణ్యాన ఐఫోన్ కొనేయొచ్చు. బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్‌లో భాగంగా ఐ ఫోన్ 11 (( iPhone 11) మొబైల్‌ని రూ.40,999కే అందిస్తుంది. కాకపోతే ఈ మాడల్ ప్రస్తుతం చాలా పాతదైపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్టు ఉంటే రూ.1250 వరకు తగ్గుతుంది. ఇవే కాకుండా ఇతర కార్డుల ద్వారా మరింత చౌకగా లభించే అవకాశాలున్నాయి. నిజానికి ఐ ఫోన్ 11 ప్రారంభ ధర రూ.43,900గా ఉంది. అంటే 4 వేల రూపాయలు తగ్గనుంది. ఒక వేళ పైన చెప్పిన కార్డులు మీ దగ్గర లేకపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇతర మార్గాల ద్వారా కూడా ఆఫర్లను పొందేందుకు అవకాశాలు కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. వాటి గురించి తెలుసుకోవాలటే వెంటనే మీ మొబైల్‌లోని ఫ్లిప్‌కార్టును ఓపెన్ చేయండి. ఇక ఆలస్యం చేయడం దేనికి? ఐ ఫోన్ కావాలనువారు వెంటనే కొనేయండి.

iphone-13-model-unselect-gallery-1-202207.jpg

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ‘‘బిగ్ బచత్ ధమాల్ సేల్‌’’ ఆఫర్లు ఈ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలతో ముగియనున్నాయి. కనుక ఐ ఫోన్ కావాలనుకునే వారు వెంటనే ఫ్లిప్‌కార్డుకు వెళ్లి ఆర్డర్ చేసుకోండి.

Updated Date - 2023-06-25T17:04:44+05:30 IST