Redmi: అద్భుత ఫీచర్లతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్స్

ABN , First Publish Date - 2023-05-19T16:12:52+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Redmi: అద్భుత ఫీచర్లతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్స్

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా రెడ్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత (India) మార్కెట్‌లో విడుదల చేసింది. రెడ్‌మి ఏ2, రెడ్‌మి ఏ2 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది. రెండు కొత్త మోడల్ ఫోన్స్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేయనున్నాయి. రెండు ఫోన్లకు 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. 8 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా ఉంటుంది. మే 23 నుంచి భారత మార్కెట్‌లో ఫోన్ల అమ్మకాలను ప్రారంభిస్తామని సంస్థ పేర్కొంది.

భారత మార్కెట్‌లో రెడ్‌మి ఏ2, రెడ్‌మి ఏ2 ప్లస్ ధరలు ఇలా ఉన్నాయి.

2జీబీ ర్యామ్‌తోపాటు 32జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి ఏ2 స్మార్ట్‌ఫోన్ రూ. 5,999 ఉంటుంది. 4జీబీ ర్యామ్‌తోపాటు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి ఏ2 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ. 7,499 ఉంటుంది. అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, షియోమి రిటైల్స్ వద్ద ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 500 క్యాష్‌బ్యాక్ లభించనుంది.

Updated Date - 2023-05-19T16:13:16+05:30 IST