Samsung: గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల అప్‌డేట్స్ ఇవే..
ABN , First Publish Date - 2023-06-16T22:31:20+05:30 IST
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఫిబ్రవరిలో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను ఫర్మ్‌వేర్ వెర్షన్ S91xBXXU2AWF1తో అప్‌డేట్ చేయనున్నట్లు నివేదికలో వెల్లడైంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసింది. అయితే జూన్ నెలలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను స్వీకరించడం ప్రారంభిస్తాయని తెలిపింది.
కొత్త ఫర్మ్‌వేర్ కెమెరా యాప్ 2x పోర్ట్రెయిట్ ఎంపిక, ఆటో ఫోకస్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు థాయిలాండ్‌లో జూన్ నెలలో ఫర్మ్‌వేర్ వెర్షన్ S91xBXXU2AWF1తో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీఎస్ 23ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్లు అప్‌డేట్ అవుతాయని నివేదికలో పేర్కొంది.