Samsung: టెలిఫోటో కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్..
ABN , First Publish Date - 2023-08-09T16:35:45+05:30 IST
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు మార్కెట్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు మార్కెట్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా టెలిఫోటో కెమెరాతో (Galaxy S24 Ultra Telephoto Camera) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. వచ్చే సంవత్సరంలో గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ అధికారికంగా తెలిపింది. స్పష్టమైన ఫోటోలు, వీడియోలు వచ్చేలా పరికరాలను ఈ ఫోన్‌లో అమర్చుతారు. 200 మెగాపిక్సెల్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిపోటో షూటర్‌తోపాటు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సదుపాయం ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..
6.65- అంగుళాల స్క్రీన్ ఆండ్రాయిడ్ 14, వన్ యూఐ 6.0 అండ్ క్వాలిక్వామ్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3ఎస్వోసీ ఉంటుంది. ఈఫోన్ ధర ఎంత ఉంటుందని ఇంకా కంపెనీ వెల్లడిచలేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్ విడుదల విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 74,999 నుంచి రూ. 1,34,999 వరకు ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ ధర కూడా సుమారు గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్ లాగే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.