Smartphones: 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్ వాడితే... ఆరోగ్యానికి ముప్పే...

ABN , First Publish Date - 2023-04-08T17:24:06+05:30 IST

చిన్న పిల్లలు, యువకులు రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ (Smartphone), టాబ్లెట్స్, టెలివిజన్ చానల్స్ (television channels), కంప్యూటర్ గేమ్స్, విద్యాసంస్థల అప్లికేషన్స్ చూడడం వల్ల వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని బ్రెజిలియన్ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది.

Smartphones: 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్ వాడితే... ఆరోగ్యానికి ముప్పే...

న్యూఢిల్లీ: చిన్న పిల్లలు, యువకులు రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ (Smartphone), టాబ్లెట్స్, టెలివిజన్ చానల్స్ (television channels), కంప్యూటర్ గేమ్స్, విద్యాసంస్థల అప్లికేషన్స్ చూడడం వల్ల వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని బ్రెజిలియన్ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది. 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థి, విద్యార్థునులపై సర్వే చేయగా.. వారిలో వెన్నెముక నొప్పి వస్తున్నట్లు ఆ కథనంలో తెలిసింది. ఈ కథనం హెల్త్‌కేర్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైంది.

teen.jpg

ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభాలోని వివిధ వయస్సుల వారు థొరాసిక్ వెన్నెముక నొప్పి భారీన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. థొరాసిక్ వెన్నెముక నొప్పి (TSP) ప్రమాద కారకాలపై హైస్కూల్ విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని, పిల్లలు కౌమారదశలో వెన్నునొప్పి వల్ల ఎక్కువ నిష్క్రియంగా ఉంటారని తెలిపింది. ఎక్కువ మానసిక సామాజిక సమస్యలను కలిగి ఉంటారని ఈ కథనంలో తెలిసింది.

Updated Date - 2023-04-08T17:54:09+05:30 IST