Share News

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. చాటింగ్ కోసం సీక్రెట్ కోడ్.. ఎలా యాక్సెస్ చేయాలంటే..?

ABN , First Publish Date - 2023-12-02T16:01:12+05:30 IST

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఉండే ఉంటుంది. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే వాట్సాప్ చూడడం అందరికీ అలవాటైపోయింది. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్‌లు చూస్తూ ఉంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.

WhatsApp: వాట్సాప్ కొత్త  ఫీచర్.. చాటింగ్ కోసం సీక్రెట్ కోడ్.. ఎలా యాక్సెస్ చేయాలంటే..?

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఉండే ఉంటుంది. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే వాట్సాప్ చూడడం అందరికీ అలవాటైపోయింది. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్‌లు చూస్తూ ఉంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది. దీనికి తోడు ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కూడా ఉండనే ఉంది. దీంతో వాట్సాపే ప్రపంచంగా మారిపోయినవారు కూడా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. వాట్సాప్‌నకు పోటీగా పలు చాటింగ్ యాప్‌లు కూడా వచ్చాయి. కానీ అవి ఏవి కూడా వాట్సాప్ హవాను అడ్డుకోలేకపోయాయి. ఆ స్థాయిలో వాట్సాప్ జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండడం కూడా దీనికి ఒక కారణం. వాట్సాప్ వాడకం విచ్చలవిడిగా ఉన్నప్పటికీ దాని భద్రత విషయమై పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఎప్పటికిప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది.


ఈ క్రమంలో చాట్‌ల కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రారంభించింది. నిజానికి వాట్సాప్‌లో ఇప్పటికే తమ వ్యక్తిగత చాట్స్‌ను లాక్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. కానీ అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. దీంతో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ నూతన ఫీచర్ వల్ల వినియోగదారుల సమాచార భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. ఈ న్యూ సీక్రెడ్ కోడ్ ఫీచర్‌తో వినియోగదారులు తమ చాట్స్‌కు పాస్‌వర్డ్‌గా వర్డ్స్, ఎమోజీలను కూడా పెట్టుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెర్చ్ బార్‌లో రహస్య కోడ్‌ను టైప్ చేయడం ద్వారా లాక్ చేసిన చాట్స్‌ను యాక్సెస్ అయ్యేలా సెట్టింగ్స్ కూడా చేయొచ్చు. "వాట్సాప్‌లో చాట్ లాక్‌కి సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో వినియోగదారులు యూనిక్ పాస్‌వర్డ్ పెట్టి తమ చాట్స్‌ను రక్షించుకోవచ్చు. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ టైప్ చేసినప్పుడు మాత్రమే లాక్ చేసిన చాటింగ్స్ కనిపించేలా వినియోగరాలు సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో ఇతరులెవరూ వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలను కనుగొనలేరు.’’ అని మెటా సీఈవో తెలిపారు.

ఎలా సెట్ చేసుకోవాలంటే..?

మొదట మీ వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి.

లాక్డ్‌చాట్ విభాగానికి వెళ్లి అందులో పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.

అందులో కనిపించే హైడ్ లాక్డ్ చాట్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.

లాక్ చేయాల్సిన చాట్‌లకు మళ్లీ యాక్సెస్ చేసుకోవడానికి సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.

లాక్ చేసిన చాట్‌లు ప్రాథమిక చాట్ విండోలో కనిపించవు.

హైడ్ చేసిన లాక్డ్‌చాట్‌లను ఓపెన్ చేయడానికి రహస్య కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. గురువారం నుంచే వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. దీంతో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది.

Updated Date - 2023-12-02T16:01:13+05:30 IST