Share News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకపై చాట్ చేస్తూనే..

ABN , First Publish Date - 2023-11-25T14:05:03+05:30 IST

ప్రస్తుతం మానవ జీవితంలో వాట్సాప్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో కచ్చితంగా వాట్పాప్ ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్‌లు చూస్తూ, ఫోన్‌లు మాట్లాడుతుంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకపై చాట్ చేస్తూనే..

ప్రస్తుతం మానవ జీవితంలో వాట్సాప్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో కచ్చితంగా వాట్పాప్ ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్‌లు చూస్తూ, ఫోన్‌లు మాట్లాడుతుంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది. వాట్సాప్ కూడా తమ వినియోగదారులను మెప్పించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అలాంటిదే వాట్సాప్ మరో ఫీచర్ తీసుకురాబోతుంది. ఈ కొత్త ఫీచర్‌లో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూనే అవతలి వారి ఫ్రొఫైల్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో అవతలి వారి ఫ్రొఫైల్ సమాచారాన్ని తెలుసుకోవడానికి బ్యాక్‌కు వెళ్లి, వాట్సాప్ ఫ్రొఫైల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాటింగ్ చేస్తూనే అవతలి వ్యక్తి పూర్తి సమాచారాన్ని చూసేయొచ్చు.


దీంతో చాట్ ఇన్ఫో స్క్రీన్‌ను ఓపెన్ చేయకుండానే అవతలి వ్యక్తి పేరు, స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్ చూడవచ్చు. అవతలి వ్యక్తి లాస్ట్ సీన్ ప్రైవసీ సెట్టింగ్స్‌ ఎనేబుల్ చేసి ఉంటే, వారి కాంటాక్ట్‌ల లాస్ట్ సీన్ కూడా చూసేయచ్చు. ఈ ఫీచర్‌తో ఇతరుల కాంటాక్ట్‌ల ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా మార్పులు చేసిన సులభంగా ట్రాక్ చేయవచ్చు. అలాగే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ అప్‌డేట్‌ ట్రాకర్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వర్షన్ 2.23.25.11 అప్‌డేట్‌లో ఇది కనిపించింది. ఈ ఫీచర్‌‌ను చాలా కాలంగా అనేక మంది వినియోగదారులు అడుతున్నారని, వాట్సాప్ ఎట్టకేలకు దీన్ని తీసుకొస్తుందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవతలి వారు మనం వారి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను చూడడానికి అనుమతించాల్సి ఉంటుంది. వారి వివరాలను ఒక వేళ హైడ్ చేసి ఉంచితే చూడడం సాధ్యపడదు. బ్లాక్ చేసినా, ఫోన్ కాంటాక్టు జాబితా నుంచి మన నంబర్‌ను తొలగించినా ఇది వర్తిస్తుంది.

దీంతోపాటు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకురాబోతుంది. ఇప్పటికే వాట్సాప్ ఛానెల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఛానెల్‌లో పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు పంపవచ్చు. అయితే పలు మార్లు ఆయా ఛానెల్స్ వాట్సాప్ రూల్స్‌ను ఉల్లంఘించే అవకాశాలుంటాయి. దీంతో వాట్సాప్ ఆయా ఛానెల్స్‌ను సస్పెండ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆయా ఛానెల్స్ రివ్యూకు వెళ్లొచ్చు. తద్వారా తమ ఛానెల్‌ను మళ్లీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే చాట్ ట్యాబ్ నుంచి ఏఐ-బేస్డ్ చాట్‌లను ఓపెన్ చేసుకునే ఒక షార్ట్‌కట్‌ను తీసుకురావడంపై కూడా వాట్సాప్ పని చేస్తోంది.

Updated Date - 2023-11-25T14:05:05+05:30 IST