WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో ఇకపై ఆ సమస్య తీరినట్టే..
ABN , First Publish Date - 2023-07-02T16:21:47+05:30 IST
మీ పాత ఫోన్‌లోని వాట్సాప్ హిస్టరీని (Whatsapp history) కొత్త ఫోన్‌లోకి ఎలా బదిలీ చేసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారా? పాత ఫోన్‌లోని వాట్సాప్‌లో ఉన్న చాట్ హిస్టరీ, ఫైల్స్(Files), ఫోటోలు(Photos), వీడియోలను(Videos) కొత్త ఫోన్‌లోకి బదిలీ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్‌లను (Third Party Apps) ఉపయోగించి చిక్కుల్లో పడుతున్నారా..
మీ పాత ఫోన్‌లోని వాట్సాప్ హిస్టరీని (Whatsapp history) కొత్త ఫోన్‌లోకి ఎలా బదిలీ చేసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారా? పాత ఫోన్‌లోని వాట్సాప్‌లో ఉన్న చాట్ హిస్టరీ, ఫైల్స్(Files), ఫోటోలు(Photos), వీడియోలను(Videos) కొత్త ఫోన్‌లోకి బదిలీ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్‌లను (Third Party Apps) ఉపయోగించి చిక్కుల్లో పడుతున్నారా? అయితే ఇక సమస్యలన్నీ తీరినట్టే.. ఎందుకంటే త్వరలోనే మీ సమస్యలన్నింటికి స్వయంగా వాట్సాపే పరిష్కారం చూపబోతుంది. వినియోగదారుల కష్టాలను అర్థం చేసుకున్న వాట్సాప్ మేనేజ్‌మెంట్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీంతో ఇక నుంచి మీరు వాట్సాప్ హిస్టరీని షేర్ చేసుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించనవసరం లేదు.
కేవలం ఒక్క క్యూఆర్ కోడ్‌తో(QR code) మీ పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ హిస్టరీని అంతా కొత్త ఫోన్‌లోని వాట్సాప్‌నకు బదిలీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా సురక్షితంగా నిముషాల వ్యవధిలోనే అయిపోతుంది. కాకపోతే రెండు మొబైల్స్ ఒక్క నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. వైఫై ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Zuckerberg) ఓ వీడియోలో చేసి చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో (facebook) అందుబాటులో ఉంది.
వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కచ్చితమైన నమ్మకం లేని థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించడం కంటే ఇది సురక్షితమైనదని జుకర్ బర్గ్ ఆ వీడియోలో తెలిపారు. ఈ పద్దతిలో వాట్సాప్ హిస్టరీ మొత్తం ఎన్‌క్రిప్ట్ మోడ్‌లో ఉంటుందని, దీంతో ఇతరులకు షేర్ అయ్యే అవకాశం లేదని తెలిపారు. క్లౌడ్ సేవలను ప్రైవేట్‌గా ఉంచుతుందని చెప్పారు. ‘‘ఇది మీ వాట్సాప్ చరిత్రను బ్యాకప్ చేయడం, పునరుద్ధిరించడం కంటే వేగవంతమైనది. దీని ద్వారా చాటింగ్స్, ఫోటోలే కాకుండా పెద్ద పెద్ద ఫైల్స్, వీడియోలను కూడా బదిలీ చేయవచ్చు. కొత్త ఫోన్‌లోకి బదిలీ చేసుకునే సమయంలో మీ డేటా అంతా ప్రైవేట్‌గా ఉంటుంది. ఇతరులకు తెలిసే అవకాశం లేదని’’ జుకర్‌బర్గ్ తెలిపారు.
వాట్సాప్ హిస్టరీని క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌లోకి ఇలా బదిలీ చేయాలి.
-ఇందుకోసం కొత్త, పాత ఫోన్లను ఆన్ చేయాలి. రెండింటిని ఒకే వైఫై (Wifi) నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి.
- పాత ఫోన్‌లో వాట్పాప్ యాప్ ఓపెన్ చేయాలి. మొదటగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఆ తర్వాత చాట్స్, ఆ తర్వాత చాట్ ట్రాన్స్‌ఫర్‌కు వెళ్లాలి. అక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కెమెరా ఓపెన్ అవుతుంది.
_ తర్వాత కొత్త ఫోన్‌లో అదే నంబర్‌తో రిజిస్టర్ అయి ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. కొత్త ఫోన్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. ఇక అంతే.. పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ హిస్టరీ అంతా సులభంగా కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
కాకపోతే వీడియోలను ట్రాన్స్‌ఫర్ చేసుకునే క్రమంలో ఒక సమస్య ఉంది. అదేటంటే హైక్వాలిటీ ఉన్న వీడియోలు అదే క్వాలిటీతో ట్రాన్స్‌ఫర్ కావు. డిఫాల్ట్‌గా ఉండే క్వాలిటీతో మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. దీంతో ప్రతిసారి హైక్వాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుంది.