Naveen case: నవీన్ హత్య ఘటనపై హరిహరకృష్ణ తండ్రి స్పందన.. ఎవరెవరు ఉన్నారో తనకు చెప్పాడని వెల్లడి

ABN , First Publish Date - 2023-02-26T17:28:39+05:30 IST

అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యను తన కొడుకు ఒక్కడే చేయాలేదని

Naveen case: నవీన్ హత్య ఘటనపై హరిహరకృష్ణ తండ్రి స్పందన.. ఎవరెవరు ఉన్నారో తనకు చెప్పాడని వెల్లడి

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ (Harihara Krishna) తండ్రి ప్రభాకర్ స్పందించాడు. ఈ హత్యను తన కొడుకు ఒక్కడే చేయలేదని, ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారని ఆరోపించారు. నిందితులందరూ బయటకు రావాలన్నారు. నవీన్‌ను హత్య చేశానని తన కుమారుడు చెబితే పోలీసులకు లొంగిపోవాలని సూచించానని చెప్పాడు. నవీన్‌‌ను (Naveen) ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో హరిహరకృష్ణ చెప్పడంతో కుమారుడిని మందలించినట్టు ప్రభాకర్ వివరించాడు. హత్య చేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారో హరిహరకృష్ణ తనకు చెప్పాడని మీడియాకు వివరించాడు. ఈ కేసులో నిందితుందరిని శిక్షించాలని డిమాండ్ చేశాడు. తన కొడుకు యూట్యూబ్‌ (Youtube)లో క్రైమ్స్ సంబంధించిన వీడియోలను చూసేవాడని, ఆ ప్రభావం అతడిపై ఉందని ప్రభాకర్ పేర్కొన్నాడు. హత్య చేసిన తర్వాత ఎలా బయటపడాలనే దానిపై కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసేవాడని చెప్పాడు.

తన మొదటి కుమారుడు ముఖేష్ కూడా ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ప్రభాకర్ వాపోయాడు. మృతుడు నవీన్ తల్లిదండ్రులను ప్రభాకర్ క్షమాపణ కోరాడు. కాగా నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool) జిల్లా చారుకొండ మండలం శిరిసనగండ్లకు చెందిన నవీన్‌ (22)కు దిల్‌సుఖ్‌నగర్‌ (Dilsukhnagar)లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా హరిహరకృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులుగా మారారు.

తొలుత నవీన్‌కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై.. అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహరకృష్ణకూ తెలుసు. నవీన్‌ బీటెక్‌ కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్‌ నల్లగొండకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా యువతితో హరి స్నేహం పెంచుకుని, ప్రేమించాడు. ఇది తెలిశాక నవీన్‌ కూడా ఆమెకు టచ్‌లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి.. కలిసి తిరిగిన స్నేహితుడే అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ.

Updated Date - 2023-02-26T18:02:24+05:30 IST