Telangana university VC: వీసీ రవీంద్ర గుప్తా నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2023-06-17T17:59:07+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 8 గంటలపాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. మరికాసేపట్లో రవీందర్ గుప్తా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Telangana university VC: వీసీ రవీంద్ర గుప్తా నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు

హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా (Telangana University VC Ravindra Gupta) నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 8 గంటలపాటు ఏసీబీ అధికారులు (ACB Officials) సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. మరికాసేపట్లో రవీందర్ గుప్తా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials) రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్‌లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏ వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్ నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-17T17:59:07+05:30 IST