రెండో ఏఎన్‌ఎంలకు అదనపు అలవెన్సులు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-01-17T23:00:19+05:30 IST
వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు అదనపు అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 31 94 జిల్లా అధ్యక్షుడు కే. కృష్ణమోహన్ గౌడ్ డిమాండ్ చేశారు.
నిర్మల్ అర్బన్, జనవరి 17 : వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు అదనపు అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 31 94 జిల్లా అధ్యక్షుడు కే. కృష్ణమోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా రెండో ఏ ఎన్ ఎంల దీర్ఘకాల సమస్యలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధన రాజ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలీచాలని వేతనాలతో రెండో ఏ ఎన్‌ఎంలు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొ దటి సమానంగా పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిని రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించా రు. కొత్తగా అదనపు పోస్టులు మంజూరు చేసి వారిని ప్రస్తు తం పని చేస్తున్న చోటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 16 ఏళ్ల నుంచి వారు చే స్తున్న సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా వారికి మంచి వార్తను అందించాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రెండో ఏ ఎన్‌ఎంలకు అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు విష యంలో, ప్రసూతి సెలవుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొందరు వైద్యాధికారులు సెలవులు మంజూరు చేయడం లేదని డీఎం హెచ్‌వో దృష్టికి తీసుకు వచ్చారు. రెండో ఏ ఎన్‌ఎంల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీ సుకువెళ్తానని డీఎంహెచ్‌వో హామీ ఇచ్చా రు. అదనపు అలవెన్స్‌ల విషయంపై క లెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశా ధికారి వేణుగోపాల రావు, నాయ కులు భోజారెడ్డి, శ్రీనివాస్ రె డ్డి, రవీందర్, మహిళా నేత లు సరస్వతి పాల్గొన్నారు.