కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణం, ప్రశాంతం
ABN , First Publish Date - 2023-02-06T22:46:57+05:30 IST
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: జిల్లాకేంద్రంలో సోమ వారం బంద్‌సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రైతు హక్కులపోరాటసమితి నాయకులు పత్తికి రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని బంద్‌కు పిలుపు నివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: జిల్లాకేంద్రంలో సోమ వారం బంద్‌సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రైతు హక్కులపోరాటసమితి నాయకులు పత్తికి రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని బంద్‌కు పిలుపు నివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పట్టణంలోని అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో బైపాస్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారొకో చేపట్టారు. సుమారు ఐదుగంటలపాటు రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలుభారీగా నిలిచిపో యాయి. ఈ సందర్భంగా రైతుహక్కు పోరాట సమితి నాయకులు, రైతులు మాట్లాడుతూ పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిన్నింగ్ వ్యాపారులు కావాలనే పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని సిండికేటుగా ఏర్పడి రైతులకు నష్టం కలిగిస్తున్నా రన్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, క్వింటాలుకు రూ.15వేలుచెల్లిం చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం లో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. రాస్తారోకోలో పోరాట సమితి నాయకులు డాక్టర్ రూప్‌నార్ రమేష్, రేగుంట కేశవరావు, మారుతి, జయరాం, కార్నాథం చంద్రయ్య, మిట్ట వెంకన్న, శంకర్, ప్రణయ్, ప్రశాంత్, బుక్యా రాజు, గడ్డల ప్రణయ్, రైతులు పాల్గొన్నారు.
వాంకిడి: మండలంలో ఉదయం నుంచి వ్యాపార సంస్థలు, కిరాణా, హోటల్‌లు, ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశా లలు స్వచ్ఛందంగా మూసివేశారు. మధ్యాహ్నం రైతుపోరాట సమితి నాయకులు నాగ్‌పూర్, హైదరాబాద్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. బడ్జెట్ సమావేశాల్లో పత్తి గిట్టుబాటు ధరపై చర్చించకపోవడం పై రైతు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పత్తి క్విం టాలుకు రూ.15వేలు గిట్టుబాటు ధర కల్పించకపోతే దశలవారీగా ఆం దోళనలు చేపడతామని రైతు పోరా టసమితి జిల్లాఅధ్యక్షుడు బోట్టుపల్లి జైరాం హెచ్చరించారు. కార్యక్రమం లో రైతు పోరాట సమితి నాయకులు దుర్గం తిరుపతి, సెండెవాసు, విలాస్ కోబ్రగడే, వాడై మెంగాజీ, రైతులు సాల్గొన్నారు.