అర్హులకు బీసీ బంధు అందించాలి

ABN , First Publish Date - 2023-09-01T22:43:34+05:30 IST

అర్హులకు బీసీ బంధు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

అర్హులకు బీసీ బంధు అందించాలి
: తహసీల్దార్‌కు దరఖాస్తులు అందజేస్తున్న బీజేపీ నాయకులు

దండేపల్లి,సెప్టెంబరు 1: అర్హులకు బీసీ బంధు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దండేపల్లిలో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంధు దరఖాస్తుదారులతో కలిసి దండేపల్లి బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం దళితబంధు, బీసీబంధు పథకాలు అమలు చేస్తూ లబ్ధి చేకూర్చుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు విడ్డూరమని విమర్శించారు. ఇటీవల ప్రభుత్వం అందించిన లక్ష రూపాయల సాయం గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్త్తలకు ఇచ్చి బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీసీల్లో 7కులాలకే ప్రభుత్వం బీసీబంధు పథకం వర్తింప చేయడం సరికాదని తెలిపారు. బీసీ సామాజిక వర్గంలో అర్హులందరికీ పథకం వర్తింజేయాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న లక్షెట్టిపేట సీఐ కృష్ణ, దండేపల్లి, జన్నారం ఎస్సైలు ప్రసాద్‌, సతీష్‌ పోలీసు సిబ్బందితో అక్కడి చేరుకొని నిరసన విరమించాలని కోరారు. తహసీల్దార్‌ బీసీ లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆందోళకారులు నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్‌ సంధ్యరాణి అక్కడికి చేరుకుని వారి సమస్యను ఉన్నత అధికారులదృష్టికి తీసుకవెళ్తుతానాని హామీ ఇచి దరఖస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజయ్య, రవిగౌడ్‌, మండల ఇన్‌చార్జి ప్రభాకర్‌, నాయకులు మల్లేష్‌, కిషన్‌, శ్రీనివాస్‌, రవిందర్‌, మల్లేష్‌, వెంకటేష్‌, రాకేష్‌, సత్తయ్య, వెంకటేష్‌, సుగుణ, తులసి, శేఖర్‌, వంశీ, సతీష్‌, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-01T22:43:34+05:30 IST