తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఎంపీ
ABN , First Publish Date - 2023-05-24T00:31:24+05:30 IST
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు.
తానూర్, మే 23 : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ‘పల్లె పల్లెకు బీజేపీ- గడగడపకు మోహన్‌రావు పటేల్’ పేరిట నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం తానూర్ మండల కేంద్రంలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానికంగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్ర జా చైతన్య ముగింపు సభకు ఎంపీ సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని అన్నా రు. దేశంలో మరోసారి నల్లధనాన్ని రూపుమాపడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2వేల నోటు ఉప సంహరించుకున్నారని.. ఈ నిర్ణయం సాహసోపేతమని అన్నారు. ముధోల్ గడ్డపై బీజేపీ జెండాను ఎగురవేయాలని కార్య కర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేత మోహన్‌రావుపటేల్ తానూర్ మండలంలోని 35 గ్రామాల్లో పర్యటించి 9వేల కుటుంబాలను కలిసి వారి కష్టలను, బాధలను తెలుసుకున్నారని ప్రశంసించారు. అనంతరం మాజీ జాతీ య బీసీ కమిషన్ సభ్యులు తలోజు ఆచారి మాట్లాడుతూ.. బీజేపీ జెం డా బీద ప్రజలకు అండ అని అన్నా రు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం సబ్‌కాసాత్ సబ్‌కా వికాస్ అన్న నినాదంతో అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. కాంగ్రె స్ హయాంలో మన దేశంలో బాం బుల వర్షం, నఖిలి కరెన్సీ నోట్ల చలామణి జరుగుతుండేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవా ంఛనీయ సంఘటనలు జరగకుండా దేశం ప్రశా ంతంగా ఉందన్నారు.
‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారు!? ’
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటివరకు ముథోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలంలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టివ్వలేదని బీజేపీ సీనియర్ నాయకులు మోహన్‌రావుపటేల్ మండిపడ్డారు. గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రజల కు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నాడన్నారు. ఇప్పటివరకు రుణమా ఫీ, కేజీటూ పీజీ విద్య ఊసే లేదని, దళిత బంధు కూడా అర్హులైన వారికి అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో కనీ సం తాగు నీరు కూడా అందడం లేదన్నారు. ఇకపై ముధోల్ నియోజక వర్గ అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా సహ బాధ్యు లు మహేష్, మాజీ ఎంపీపీ సుభాష్‌పటేల్, నాయకులు పాల్గొన్నారు.