దిందా వాగుపై బ్రిడ్జి నిర్మించాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2023-07-15T22:14:07+05:30 IST

చింతలమానేపల్లి, జూలై 15: మండలంలోని దిందా వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మండలంలోని దిందా గ్రామం వద్దగల వాగును సందర్శించారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి పదివేల కోట్ల నుంచి కనీసం రెండు కోట్లతో దిందా వాగుపై బ్రిడ్జినిర్మించడం లేదని నిలదీశారు.

దిందా వాగుపై బ్రిడ్జి నిర్మించాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

చింతలమానేపల్లి, జూలై 15: మండలంలోని దిందా వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మండలంలోని దిందా గ్రామం వద్దగల వాగును సందర్శించారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి పదివేల కోట్ల నుంచి కనీసం రెండు కోట్లతో దిందా వాగుపై బ్రిడ్జినిర్మించడం లేదని నిలదీశారు. ఎనిమి దేళ్ల క్రితం ఎంబీఏ విద్యార్థి రామకృష్ణ వాగులో పడి మరణిం చారని గుర్తుచేశారు. రామకృష్ణ పేరిట బ్రిడ్జి నిర్మిస్తామని కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే ఇప్పటివరకు పట్టించుకోలే దన్నారు. ఎమ్మెల్యే కోనప్ప వచ్చి దిందా వాగు ఒడ్డుమీద ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వాగుకు అవతలివైపు ఉన్న గ్రామస్థు లతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ గ్రామంలోని పాఠశాలకు వెళ్లలేక ఆగిపో యిన టీచర్లను కలిశారు. వర్షాకాలంలో ఆ గ్రామస్తులకు ఏమైన అత్యవసరం వస్తే చావడం ఒక్కటే మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఫాంహౌస్‌లకు రోడ్లు ఇలాగే ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హర్షద్‌ హుస్సేన్‌, సిడాం గణపతి, చిన్నయ్య, గణపతి, విజయనిర్మల, రాంప్రసాద్‌, లహంచు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలకు భవనాలు నిర్మించరా?

చింతలమానేపల్లి: ప్రభుత్వం పోలీసు స్టేషన్‌ భవనాలు నిర్మించినట్లు పాఠశాలలు నిర్మించరా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. మండలం లోని కేజీబీవీ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వెళ్లే పాఠశాలకు కనీసం రోడ్డు సౌకర్యం, ఆటస్థలం, కంపౌండ్‌ వాల్‌ కూడా లేదని ఆరోపించారు. ప్రజలను అణిచివేసే పోలీసు స్టేషన్లను అత్యంత ఆధునిక వసతులతో నిర్మించి పాఠశాలలను మాత్రం గాలికి వదిలేశారని అన్నారు. సమస్యలను పరిష్క రించాలని త్వరలోనే కలెక్టర్‌కు లేఖ రాస్తామన్నారు. ఆయన వెంట నాయకులు హర్షద్‌హుస్సేన్‌, గణపతి, చిన్నయ్య, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T22:14:07+05:30 IST