సంస్కృతిని భావితరాలకు అందించాలి
ABN , First Publish Date - 2023-09-14T23:04:08+05:30 IST
సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 14: సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన పొలాల పండగ వేడుకల్లో కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దస్నాపూర్ నుంచి నిర్వహించిన బసవన్నల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు పట్టణంలోని కుమరం భీం చౌక్ నుంచి అంకమరాజు ఆలయం వరకు కొనసాగింది. మండలంతో పాటు పట్టణంలో పొలాల పండగను ఘనంగా జరుపుకున్నారు. బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగేవ్వర్‌రావు, నాయకులు బాలేష్‌గౌడ్, వెంకన్న, శ్యాంనాయక్, సరస్వతి, గణేష్‌రాథోడ్, నిజాం, సతీష్‌బాబు, విశాల్, గణేష్, రమేష్, ప్రణయ్, మారుతి, బాబురావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: పట్టణంలో పొలాల అమావాస్య సందడి నెలకొంది. పొలాల అమావాస్య ఉండడంతో వివిధ వార్డుల ప్రజలు పూలు, పత్రి, మట్టి ఎడ్లను కొనుగోలు చేశారు. ఒక వైపు కురుస్తున్నప్పటికీ చిరు వ్యాపారులు అమ్మకాలు కొనసాగించారు.
సిర్పూర్(యు): మండలంలో గురువారం మండల ప్రజలు, రైతులు పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. పొలాల అమావాస్య రోజున వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా ఉండే ఎద్దులను ఉదయమే చెరువులు, వాగుల వద్దకు తీసుకెళ్లి రైతులు శుభ్రం చేశారు. ఇంటికి తరలించి అలంకరణ సామగ్రితో అందంగా ముస్తాబు చేశారు. సాయంత్రం ఆలయాల్లో కాడెద్దులతో ప్రదక్షిణ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఆత్రం ఓంప్రకాష్, ఆత్రం గాంగారాం, ఆత్రం నితీన్ కుమార్, కనక నాగోరావు, కనక శ్యాంరావు, గోడం అమృ త్‌రావు, తోడసం యదవ్‌రావు, మడావి ధర్ము, వెడ్మ భరత్, మదేవాడ్ దత్త, మదేవాడ్ అనిల్, కోట్నాక మారుతి కనక వేంకటేష్, కనక యశ్వంత్‌రావు, కనక ఆనంద్‌కుమార్, కనకమారుతి, ఆత్రం విజయ్ కుమార్, ఆత్రం మోహత్‌రావు, ఆత్రం భీంరావు పాల్గొన్నారు.
జైనూర్: మండలడలో పొలాల అమావాస్యను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు కాడెద్దులను అలంకరించి ఆలయంలో ప్రదర్శనలు చేయించారు.
వాంకిడి: మండలంలో పొలాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి బసవన్నలను రంగు రంగులతో అలంకరించారు. సాయంత్రం మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద బసవన్నలను ప్రదక్షిణలు చే ుుంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్, మహిళ ఎస్సై తేజస్వీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌటాల: మండలంలో పొలాల పండగను నిర్వహించారు. ముం దుగా మట్టితో బసవన్నలను తయారు చేసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాడవాడల్లో ఊరేగిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దహెగాం: మండల వ్యాప్తంగా పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టు ప్రదక్షణలు నిర్వహించారు.
చింతలమానేపల్లి: మండలంలో గురువారం పొలాల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆయా గ్రామాల్లో ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెంచికలపేట: మండలంలో గురువారం పొలాల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గ్రామాల్లోని పోచమ్మ ఆలయాల చుట్టు ఎద్దులను ఊరేగించారు.
సిర్పూర్(టి) మండలంలో గురువారం పొలాల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆయా గ్రామాల్లో ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.