ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట దుర్గం చిన్నయ్య బాధితురాలు ధర్నా

ABN , First Publish Date - 2023-06-09T16:10:20+05:30 IST

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకు సీఎం కేసీఆర్ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎమ్మెల్యేను

ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట దుర్గం చిన్నయ్య బాధితురాలు ధర్నా
MLA Durgam Chinnaiah

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (MLA Durgam Chinnaiah) బాధితురాలు శేజల్ ఆందోళన ఉధృతం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కార్యాలయం (BRS office) ఎదుట శేజల్ ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకు సీఎం కేసీఆర్ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎమ్మెల్యేను పార్టీ నుంచీ సస్పెండ్ చేసి.. అలాగే కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. హైదర్‌గూలో ఇచ్చిన 404 ఫ్లాట్‌ను బ్రోతల్ హౌస్‌గా మార్చిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటి కైనా తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు వాస్తవాలను 5 కోట్ల మంది ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆరిజిన్ డైరీ విషయంలోనే కాకుండా ఎమ్మెల్యే అనుచరులు భీమాగౌడ్, గోలి శివలు చేసిన భూ కబ్జాల మీద విచారణ చేసి నిజాలను ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. అన్యాయంగా తన మీద పెట్టిన తప్పుడు కేసులు మీద పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని అభ్యర్థించింది. ఎమ్మెల్యే తనను లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా చంపేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆమె కోరారు.

Updated Date - 2023-06-09T16:10:20+05:30 IST