ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ABN , First Publish Date - 2023-06-19T22:59:54+05:30 IST

ఆసిఫాబాద్‌, జూన్‌ 19: ప్రజావాణి కార్యక్ర మం ద్వారా ప్రజాసమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవ రావు అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ఆసిఫాబాద్‌, జూన్‌ 19: ప్రజావాణి కార్యక్ర మం ద్వారా ప్రజాసమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవ రావు అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సిర్పూర్‌(టి) మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన తాళ్లపల్లి పత్రు తనకు తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమి పట్టా పాసుపుస్తకంలో నమోదు కాలేదని ఈ విషయం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన దుర్గం కాసుబాయి తన తండ్రి నుంచి తనకు రావాల్సిన వాటాను తనకు తెలియకుండా సోదరులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రక్రియను నిలిపి వేయాలని కోరుతూ అర్జీసమర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఇంద్ర మార్కెట్‌ ప్రాంతానికి చెందిన షాగుప్తనాజ్‌ తాను కాగజ్‌నగర్‌ పట్టణం 25వ వార్డులో ఖాళీగా ఉన్న మీసేవా కేంద్రం కోసం నిర్వహించిన పరీక్షకు హాజరై అర్హత పొందానని తనకు మీసేవాకేంద్రం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కెరమెరి మండలానికి చెందిన రాథోడ్‌ కవిత తనకు ఇంటి స్థలం ఉందని గృహలక్ష్మి పథకంకింద ఆర్థికసాయం అందించాలని కోరుతూ దర ఖాస్తు అందజేశారు. కెరమెరి మండలం కరంజివాడకు చెందిన రాథోడ్‌ సావి త్రిబాయి తనకు రెండు పడక గదుల ఇళ్ల పథకంలో అవకాశం కల్పించాలని దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామానికి చెందిన బెడకల పాపయ్య తనభూమిని కొందరు అధికారపార్టీ నాయకులు ఆక్రమిం చుకొన్నారని దీనిపై విచారించి న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు.

Updated Date - 2023-06-19T22:59:54+05:30 IST